బిగ్ బాస్2: నూతన్ నాయుడు రాకపోవడానికి కారణం..?

Published : Sep 29, 2018, 09:36 AM IST
బిగ్ బాస్2: నూతన్ నాయుడు రాకపోవడానికి కారణం..?

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. శుక్రవారం నాటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ తిరిగి హౌస్ లోకి వచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కలుపుకొని మొత్తం 18 మంది ఇంటి సభ్యులు ఉండగా.. హౌస్ లో 17 మంది మాత్రమే కనిపించారు. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి వెళ్లిన నూతన్ నాయుడు మాత్రం నిన్నటి ఎపిసోడ్ లో కనిపించలేదు. 

ఆయన హాజరుకాకపోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. షో మొదలైన రెండో వారంలోనే ఎలిమినేట్ అయిన నూతన్ కి మరోసారి హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. అలా వెళ్లిన తరువాత ఓ టాస్క్ లో ఆయన భుజానికి తగిలిన గాయం కారణంగా హౌస్ నుండి బయటకి వచ్చారు. తిరిగి హౌస్ లోకి మళ్లీ వెళ్లినా.. ఎలిమినేట్ అయ్యారు.

ఆయన ఎలిమినేషన్ కావడంపై పెద్ద చర్చ నడిచింది. ఈ క్రమంలో శుక్రవారం ఎపిసోడ్ లో ఆయన కనిపించకపోవడానికి బలమైన కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం  ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో కూడా నూతన్ ఎక్కడా కనిపించలేదు. 

అయితే తన ఎలిమినేషన్ ప్రజల తీర్పుకి అనుగుణంగా జరగలేదని దీనిపట్ల నిరాసకి గురైనట్లు నూతన్ నాయుడు ఓపెన్ గా లెటర్ రాశారు. ఎందరో తనకు ఓట్లు వేస్తే వాటిని బిగ్ బాస్ పరిగణలోకి తీసుకోలేదని.. కావాలనే పక్షపాతంతో ఇదంతా చేసినట్లు తాను నమ్ముతున్నట్లు నూతన్ నాయుడు లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆయన బిగ్ బాస్ హౌస్ లో జరిగిన ఫ్యామిలీ పార్టీకి హాజరు కాలేదని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే