బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాకు నో చెప్పేశాడట!

Published : Sep 28, 2018, 08:52 PM IST
బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాకు నో చెప్పేశాడట!

సారాంశం

విలన్ గా చేసి బాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. అయితే ఆ సినిమా ఘన విజయం సాధించినప్పటికీ సుదీర్ బాబు హిందీలో మరో సినిమా చేయలేదు. ఇకపోతే ఇటీవల కరణ్ జోహార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాలో అవకాశం వచ్చిందట. 

బాలీవుడ్ లో అప్పుడపుడు మన తెలుగు హీరోలు నటిస్తున్న సంగతి తెలిసిందే. యువ హీరో సుదీర్ బాబు 'భాఘి' సినిమాతో నార్త్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేశాడు. విలన్ గా చేసి బాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. అయితే ఆ సినిమా ఘన విజయం సాధించినప్పటికీ సుదీర్ బాబు హిందీలో మరో సినిమా చేయలేదు. ఇకపోతే ఇటీవల కరణ్ జోహార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాలో అవకాశం వచ్చిందట. 

ఆ సినిమాలో  రణబీర్ కపూర్ - అలియా భట్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా నాగార్జున కూడా ఒక క్యారెక్టర్ లో కనిపించనున్నారు. అయితే ఆ కథలో మెయిన్ విలన్ క్యారెక్టర్స్ లో ఒక పాత్ర కోసం సుదీర్ బాబును సంప్రదించగా చేయనని డైరెక్ట్ గా చెప్పేశాడట. రీసెంట్ అందుకు సంబందించిన వివరణ కూడా ఇచ్చాడు సుదీర్. 

ఆ సినిమా 2020లో రిలీజ్ కానుంది. అయితే అదే సమయానికి నేను చేస్తున్న పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా వచ్చే అవకాశం ఉంది. తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతుండడంతో రెండు సినిమాలు క్లాష్ అవ్వడం కరెక్ట్ కాదు. పైగా బ్రహ్మాస్త్ర పాత్రకు శరీరాకృతి మార్చుకోవాలి. దీంతో రెండు ప్రాజెక్ట్ లకు ఇబ్బంది కాకూడదని బ్రహ్మాస్త్ర వదులుకున్నట్లు సుదీర్ తెలిపాడు.  

 

 

PREV
click me!

Recommended Stories

నా కూతురు చిన్న పిల్ల... మీరు రాసే వార్తలు చదివితే తట్టుకోగలదా? స్టార్ హీరో ఎమోషనల్
Balakrishna Favourite : బాలయ్య కు బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకు ?