కౌశల్ ని తల్చుకుంటే బాధగా ఉంది.. నూతన్ నాయుడు!

Published : Aug 18, 2018, 06:56 PM ISTUpdated : Sep 09, 2018, 11:51 AM IST
కౌశల్ ని తల్చుకుంటే బాధగా ఉంది.. నూతన్ నాయుడు!

సారాంశం

బిగ్ బాస్ సీజన్2 లో కంటెస్టెంట్ గా వెళ్లిన కౌశల్ కోసం సోషల్ మీడియాలో ఏకంగా ఆర్మీలు తయారయ్యాయి. ఈ ఆర్మీ హౌస్ లో కౌశల్ కి వ్యతిరేకంగా ఉన్న వారిని ఎలిమినేషన్ ద్వారా బయటకి పంపేలా చేస్తోంది

బిగ్ బాస్ సీజన్2 లో కంటెస్టెంట్ గా వెళ్లిన కౌశల్ కోసం సోషల్ మీడియాలో ఏకంగా ఆర్మీలు తయారయ్యాయి. ఈ ఆర్మీ హౌస్ లో కౌశల్ కి వ్యతిరేకంగా ఉన్న వారిని ఎలిమినేషన్ ద్వారా బయటకి పంపేలా చేస్తోంది. నూతన్ నాయుడు హౌస్ లో ఉన్న రెండు వారాలు కౌశల్ ని సపోర్ట్ చేస్తూ సన్నిహితంగా ఉన్నారు. ఆయన బయటకి వెళ్లిపోయిన తరువాత కౌశల్ మళ్లీ ఒంటరి వాడైపోయాడు.

ఇప్పుడిప్పుడే హౌస్ మేట్స్ అందరూ అతడితో కలిసిమెలుగుతున్నారు. అయితే రీసెంట్ గా నూతన్ నాయుడు హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. అప్పటినుండి కౌశల్, నూతన్ ఒక్కటిగా ఉంటున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో నూతన్ భుజనాయికి గాయం కావడంతో అతడిని హౌస్ నుండి బయటకి పంపేయాల్సిన పరిస్థితి కలిగింది. ట్రీట్మెంట్ కోసం నూతన్ ని హాస్పిటల్ లో చేర్చారు. ఈ విషయం తెలిసిన కొందరు కౌశల్ అభిమానులు నూతన్ ని పరామర్శించడానికి వెళ్లగా నూతన్ వారితో కౌశల్ గురించే మాట్లాడారట.  

''కౌశల్ ని బిగ్ బాస్ హౌస్ లో మాములుగా టార్గెట్ చేయడం లేదు. ప్రతి ఒక్కరికీ కౌశల్ అంటే ఒళ్లు మంట. శ్యామల తప్ప మిగిలినవారెవ్వరినీ నమ్మలేం. కౌశల్ ని తలచుకుంటేనే బాధగా ఉంది. ఒక్కడే అంతమందిని ఎలా ఎదుర్కొంటాడో.. నిన్నటి టాస్క్ లో చూశారు కదా.. అందరూ కౌశల్ ని ఎలా టార్గెట్ చేశారో.. కౌశల్ బాధ చూడలేక నేను రోల్ రైడాపై బంతులు విసిరాను. కానీ బ్యాడ్ లక్ పాతగాయం మళ్లీ తిరగబడింది'' అంటూ కౌశల్ ఫ్యాన్స్ తో చెప్పినట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ