నిజాలు దాయాలని అనుకోవడం లేదు.. ఐశ్వర్యరాయ్ సంచలన కామెంట్స్!

Published : Aug 18, 2018, 06:37 PM ISTUpdated : Sep 09, 2018, 01:32 PM IST
నిజాలు దాయాలని అనుకోవడం లేదు.. ఐశ్వర్యరాయ్ సంచలన కామెంట్స్!

సారాంశం

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ లో ధోనీ, సంజయ్ దత్ జీవితాల ఆధారంగా రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయి

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ లో ధోనీ, సంజయ్ దత్ జీవితాల ఆధారంగా రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయి. ఇక తెలుగులో ఎన్టీఆర్, వైఎస్సార్ జీవిత కథలతో సినిమాలు రూపొందుతున్నాయి. తమిళంలో జయలలిత, ఎంజిఆర్ ల బయోపిక్ లను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

తాజాగా మరో బయోపిక్ ను రూపొందించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ జీవిత కథతో సినిమా చేయాలనిఅనుకుంటున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి మిస్ వరల్డ్ గా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఆమె ఎదిగిన క్రమం, అభిషేక్ తో పెళ్లి.. దానికి ముందు పలు వివాదాలు, హీరోలతో ఎఫైర్లు ఇలా ఒక సినిమాకు కావాల్సినంత స్టఫ్ ఆమె జీవితంలో ఉంది.

దీంతో ఐశ్వర్య బయోపిక్ తీస్తే హిట్ కొట్టడం ఖాయమని భావిస్తున్నారు. ఆ దిశగా పనులు ప్రారంభించారు. ఈ విషయంపై స్పందించిన ఐశ్వర్య.. 'నా జీవిత కథతో సినిమా రూపొందాలని నేను కూడా కోరుకుంటున్నాను. నా జీవితంలో ఉన్న అన్ని కోణాలు ప్రజలకు తెలియాలి. ఏది దాచాలని అనుకోవడం లేదు. ఇదొక గొప్ప కథ అవుతుంది' అని వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ