షాకింగ్.. అతడే తన భర్త అని కంఫర్మ్ చేసిన నటి

pratap reddy   | Asianet News
Published : Oct 11, 2021, 05:08 PM IST
షాకింగ్.. అతడే తన భర్త అని కంఫర్మ్ చేసిన నటి

సారాంశం

గత కొంత కాలంగా బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నుస్రత్ జహాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరుపున బషిర్హాట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించింది.

గత కొంత కాలంగా బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నుస్రత్ జహాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరుపున బషిర్హాట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ యంగ్ బ్యూటీ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. 

ఆమె వ్యక్తిగత జీవితం కూడా అనేక ఒడిదుడుకులకు లోనైంది. 2019లో నుస్రత్..నిఖిల్  జైన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. గత ఏడాది వీరిద్దరూ విభేదాల కారణంగా విడిపోయారు. సరిగ్గా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తే సమయానికి ఆమె గర్భవతి. ఆగష్టు నెలలో నుస్రత్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 

ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో.. నుస్రత్ మాజీ భర్త చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నుస్రత్ కి పుట్టబోయే బిడ్డకు, తనకు సంబంధం లేదని.. ఆమె తన వల్ల గర్భవతి కాలేదని తేల్చేశాడు. ఆ తర్వాత నుస్రత్ కూడా తమ వివాహం అసలు చట్టబద్దం కాదని పేర్కొంది. ఈ క్రమంలో నుస్రత్ బిడ్డకు తండ్రి ఎవరనే ప్రశ్న తలెత్తింది. 

ఈ నేపథ్యంలో నటుడు, పొలిటీషియన్ అయిన యష్ దాస్ గుప్త తో ఆమె ఎఫైర్ బయట పడింది. భర్తతో కాకుండా మరో వ్యక్తితో గర్భవతి అయిందనే విమర్శలు నుస్రత్ పై ఎక్కువయ్యాయి. కానీ ఆ విమర్శలని నుస్రత్ పట్టించుకోలేదు. ఈ క్రమంలో నుస్రత్, యష్ దాస్ గుప్త పెళ్లి చేసుకుంటారా అనే చర్చ జరుగుతూ వచ్చింది. తాజాగా నుస్రత్ ఊహించని షాక్ ఇచ్చింది. యష్ దాస్ తో క్యాండిల్ లైట్ డిన్నర్ లో పాల్గొన్న నుస్రత్.. తన భర్త, తన బిడ్డకు తండ్రి యష్ దాస్ అంటూ కంఫర్మ్ చేసింది. కేకుపై భర్త, తండ్రి అని రాసిఉన్న పిక్ ని నుస్రత్ షేర్ చేసింది. 

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌