ప్రముఖ విలక్షణ నటుడు నెడుమూడి వేణు కన్నుమూత

By Aithagoni RajuFirst Published Oct 11, 2021, 4:11 PM IST
Highlights

నెడుమూడి వేణు ఇటీవల కరోనా బారిన పడ్డారు. దాన్నుంచి కోలుకున్నారు. ఆ తర్వాత తిరిగి అనారోగ్యానికి గురి కావడం, సడెన్‌గా కన్నుమూయడంతో మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. నెడుమూడి వేణు మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 

ప్రముఖ మలయాళ నటుడు నెడుమూడి వేణు(73) కన్నుమూశారు. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఆదివారం అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేశారు. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు.

nedumudivenu ఇటీవల కరోనా బారిన పడ్డారు. దాన్నుంచి కోలుకున్నారు. ఆ తర్వాత తిరిగి అనారోగ్యానికి గురి కావడం, సడెన్‌గా కన్నుమూయడంతో మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. నెడుమూడి వేణు మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ తారలు జయరామ్‌, పృథ్వీరాజ్‌, సుకుమారన్‌, టొవినో థామస్‌ ఇలా అనేక మంది ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

malayalam సీనియర్‌ నటుడిగా, విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న నెడుమూడి వేణు థియేటర్‌తో షో బిజ్‌లో తన వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఆయన 1978లో దర్శకుడు జి అరవిందన్‌ రూపొందించిన `తంబు` చిత్రంతో మాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అప్పటి ఇప్పటి వరకు దాదాపు నాలుగు దశాబ్దాలపాటు అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. మలయాళంతోపాటు తమిళంలో కలిపి ఆయన దాదాపు 500లకుపైగా సినిమాల్లో నటించారు.

also read: బ్రేకింగ్... మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా... టాలీవుడ్ కి నేను అతిథిగానే ఉంటాను

జి అరవిందన్‌, భరతన్‌, పి పద్మరాజన్, ఫాజిల్‌, ప్రియదర్శన్‌, బ్లెస్సీ, లాల్‌ జోస్‌ వంటి మేకర్స్ తో పనిచేశారు. `పూచక్కోరు ముక్కుతి`, `హిస్‌ హైనెస్‌ అబ్దుల్లా`, `మార్గం`, `చామరమ్‌`, `ఒరు మిన్నమినుంగింటే నురుంగువేట్టమ్‌`, `తెన్మావిన్‌ కొంబత్‌`, `భరతం` వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో ఆయన భాగమయ్యారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆయన విభిన్న పాత్రలతో మెప్పించారు. తన అద్భుత నటనకు రెండు జాతీయ అవార్డులను అందుకున్నారు. 

click me!