ఎన్టీఆర్‌ కోసం ఏకంగా ప్రపంచ సుందరి.. ? నిజమైతే పిచ్చెక్కిపోవాల్సిందే!

By Aithagoni Raju  |  First Published Jun 12, 2023, 3:52 PM IST

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అప్పుడే మరో సినిమాకి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. `ఎన్టీఆర్‌ 31`కి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ వైరల్‌ అవుతుంది. 


ఎన్టీఆర్‌.. సినిమాల లైనప్‌ ఇప్పుడు అదిరిపోయేలా ఉంది. ప్రస్తుతం ఆయన కమిట్‌ అయిన రెండు సినిమాలకు సంబంధించిన వార్తలే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారాయి. అందులో `దేవర`(ఎన్టీఆర్‌ 30) శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తుంటే, సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారు. ఇప్పటికే సైఫ్‌.. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలోని ఓ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. 

ఇదిలా ఉంటే అప్పుడే ఎన్టీఆర్‌ 31కి సంబంధించిన వార్తలు, అప్‌డేట్లు ఊపందుకున్నాయి. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాకి సంబంధించిన న్యూస్‌ తరచూ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇటీవల ఇందులో నటించే హీరోయిన్‌కి సంబంధించిన వార్త రచ్చ చేసింది. ఇందులో తారక్‌కి జోడీగా గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రాని అనుకుంటున్నారని, ఆమెతో చర్చలు జరుపుతున్నారనే వార్త బయటకు వచ్చింది. అది రెండు మూడు రోజులు ట్రెండ్‌ అయ్యింది. తాజాగా మరో క్రేజీ రూమర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో నటించే విలన్‌ పాత్రకి సంబంధించిన అప్‌డేట్‌ ఒకటి చర్చనీయాంశం అవుతుంది. 

Latest Videos

ఎన్టీఆర్‌ 31లో విలన్‌ పాత్ర కోసం విశ్వ సుందరిని తీసుకోబోతున్నారట. ప్రస్తుతం మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌ని అనుకుంటున్నారని సమాచారం. 1994లో మిస్‌ వరల్డ్ టైటిల్‌ గెలుచుకున్న ఐశ్వర్యా రాయ్‌ని నెగటిల్‌ రోల్‌ కోసం తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఉన్నారట. ఐశ్వర్య.. బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ వైఫ్‌, అమితాబ్‌ బచ్చన్‌ కోడలనే విసయం తెలిసిందే. ఆమె చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. ఇటీవల ఆమె `పొన్నియిన్‌ సెల్వన్‌`లో నందినిగా నెగటివ్‌ రోల్‌ చేసింది మెప్పించింది. కథ మొత్తాన్ని మలుపుతిప్పింది. అద్భుతమైన నటనతో మెప్పించింది. రెండో భాగంలో ఆమె పాత్ర హైలైట్‌గా నిలిచింది. 

దీంతో కన్నింగ్‌ రోల్స్ కి ఐశ్వర్య కేరాఫ్‌గా మారిపోతుంది. ఇందులో ఆమె నటన అందరిని ఆకట్టుకుంది. అందుకే ఈ బ్యూటీకి ఇప్పుడు నెగటివ్‌ రోల్స్ క్యూ కడుతున్నాయట. అందులో భాగంగానే ఇప్పుడు `ఎన్టీఆర్‌31`లో కూడా ఐష్‌ని తీసుకోవాలనుకుంటున్నారట ప్రశాంత్‌ నీల్‌. మరి ఇందులో నిజమెంతో కానీ, ఇది నిజమే అయితే,ఈ సినిమాలో ఐష్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తే ఈ కాంబో నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని చెప్పొచ్చు. చివరగా `పీఎస్‌2`లో నటించిన ఐష్‌ ప్రస్తుతం ఖాళీగానే ఉంది. 

click me!