మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. ఈరోజే అదిరిపోయే అప్డేట్ రానుంది. రవితేజ 73వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కు మేకర్స్ టైమ్ కూడా ఫిక్స్ చేశారు. డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అదరగొడుతోంది. యంగ్ హీరోల కన్నా స్పీడ్ గా మూవీలను కంప్లీట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన అభిమానులను ఖుషీ చేస్తున్నారు. మొదటి నుంచీ వేగంగా సినిమాలు చేస్తూ వచ్చిన రవితేజ ఇప్పటికీ అదే స్పీడ్ ను కొనసాగిస్తున్నారు. చివరిగా ‘రావణసుర’తో అలరించిన మాస్ రాజా ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వర రావు’ (Tiger Nageswara Rao) చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తోంది. తదుపరి కార్యక్రమాలతో యూనిట్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. రవితేజ నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టారు. ఒప్పటికే ఓ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసినట్టు టాక్. RT73 వ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ లో సినిమాటోగ్రఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన నిఖిల్ సిద్ధార్థ ‘సూర్య వర్సెస్ సూర్య’ చిత్రంతో డైరెక్టర్ గా మారాయి. ఆ చిత్రం తర్వాత మళ్లీ మాస్ రాజాను డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ చిత్రం నుంచి కొద్ది సేపటి కింద అఫీషియల్ అప్డేట్ అందింది. RT73 టైటిల్ ను ఈరోజే అనౌన్స్ చేయబోతున్నట్టు మేకర్స్ అప్డేట్ అందించారు. ఈరోజు సాయంత్రం 6:03 నిమిషాలకు టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో రానుందని అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. మరోవైపు గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనూ ఓ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. రవితేజ హీరోగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా రూపొందుతోంది. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటు ప్రజలను .. అటు పోలీస్ వారిని నానా తిప్పలు పెట్టిన స్టూవర్టుపురం గజదొంగ కథ ఇది. ఆ పాత్రలో రవితేజ కనిపించనున్నాడు. ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. 20 అక్టోబర్ 2023న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.
This time MASS will surge to new skies 🔥
Mass Maharaja 's - Title Announcement Video 🤩
Today at 6:03PM 📣
A 's Directorial 🎬 pic.twitter.com/okS936kiJH