రాజకీయాల్లోకి నటుడు సప్తగిరి.. ఏ పార్టీలో చేరబోతున్నారు.. పోటీ చేసేది ఇక్కడి నుంచే?

By Asianet News  |  First Published Jun 12, 2023, 3:32 PM IST

టాలీవుడ్ నటుడు, కమెడియన్ సప్తగిరి (Saptagiri)   రాజకీయాల్లోకి ఎ:ట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఓ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన డిటేయిల్స్ ను వెల్లడించారు.
 



వెండితెరపై అలరించిన నటీనటులు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా పార్టీల్లో వెండితెరపైతోపాటు బుల్లితెరపైన అలరించిన వారు కూడా చేరుతున్నారు. తాజాగా కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు దక్కించుకున్న సప్తగిరి (Saptagiri) కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఉన్నట్టుండి అనౌన్స్ చేయడంతో ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గ్గా మారింది. 

తాజాగా తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి సప్తగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో ఇష్టమని, త్వరలోనే తను ఆ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. అంతే కాదు 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు కూడా కన్ఫమ్ చేశారు. దీంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. 

Latest Videos

అలాగే సప్తగిరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని కూడా స్పష్టం చూశారు. ఈ విషయంలో ఫైనల్ డెసీషన్ నారా లోకేష్ దే ఉంటుందని చెప్పుకొచ్చారు. టికెట్ విషయంలో సప్తగిరి లోకేష్ నుంచి పూర్తి హామీ లభించిందని కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నానేది కూడా త్వరలోనే వెల్లడిస్తామన్నారు. 

 ఇంకా మాట్లాడుతూ.. కేవలం పేదలకు సేవ చేయటానికే రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పుకొచ్చారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి తనవంతు సేవలు అందిస్తానన్నారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు కూడా ఆయన సిద్ధంగానే ఉంటానని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ మాటకు కట్టుబడి ఉంటానన్నారు. ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. 

click me!