మళ్లీ తండ్రి కాబోతున్న తారక్.. ఇదిగో ప్రణతి ఫోటో

Published : Mar 02, 2018, 05:26 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
మళ్లీ తండ్రి కాబోతున్న తారక్.. ఇదిగో ప్రణతి ఫోటో

సారాంశం

ఎన్టీఆర్ కెరీర్ తో పాటుగా ప్రైవేట్ లైఫ్ లో కూడా చాలా ఆనందంగా ఉన్నారు. లక్ష్మీ ప్రణతి ని పెళ్లాడిన తారక్ కు ఒక బాబు కూడా ఉన్నాడు. ​ ఇప్పుడు మళ్లీ ఈ దంపతులు రెండవ సంతానాన్ని త్వరలో ఆహ్వానించబోతున్నారు .

 

వరుస హిట్లతో దూసుకుపోతున్నహీరో ఎన్టీఆర్ కెరీర్ తో పాటుగా ప్రైవేట్ లైఫ్ లో కూడా అంతే ఆనందంగా ఉన్నారు. 2011 లో లక్ష్మీ ప్రణతి ని పెళ్లాడిన తారక్ కు ఒక బాబు కూడా ఉన్నాడు. అభయ్ రామ్ పుట్టాక తన జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది అంటున్న ఎన్టీఆర్ ఇప్పుడు మరో సారి తండ్రి కాబోతున్నాడు అని వార్తలు మనం వింటూనే ఉన్నాం. అది నిజమా కాదా అన్న సందేహంలో ఉన్నారు అందరు.లక్ష్మీ ప్రణతి రెండోసారి గర్భవతి అయ్యింది అన్న విషయం ఇండస్ట్రీలొనే ఒక హాట్ టాపిక్ గా మారింది. మరొక బుల్లి ఎన్టీఆర్ నందమూరి కుటుంబంలోకి అడుగుపెట్టబోతున్నాడు అని ఫాన్స్ అంతా పండగలా సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ దీనిపై ఆఫీషియల్ గా ఎటువంటి కన్ఫర్మేషన్ రాకపోయేసరికి ఫాన్స్ కొంత డీలా పడ్డారని చెప్పచ్చు. ఎన్టీఆర్ కానీ నందమూరి కుటుంబ సభ్యులు లని స్వయంగా చెప్పకపోయినా అనటానికి గల కొన్ని ప్రూఫ్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్లిన ప్రణతి బేబీ బంప్ తో కనపడేసరికి ఫాన్స్ లో మళ్ళీ ఆనందోత్సాహం ఉప్పొంగిపోతున్నారు. మొత్తానికి ఎవరు అనౌన్స్ చేయాకపోయినా ప్రణతిని చూసి అందరూ కుదుటపడ్డారు. మేలో డెలివరీ డేట్ ఇచ్చారని తెలియగానే ఫ్యాన్సే కాకుండా నందమూరి ఫ్యామిలీ కూడా అభయ్ రామ్ కు తమ్ముడు పుడతాడా చెల్లెలు పుడుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్