ఎన్టీఆర్ అభిమానులకు న్యూ ఇయర్ పండగ

Published : Dec 31, 2016, 08:39 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
ఎన్టీఆర్ అభిమానులకు న్యూ ఇయర్ పండగ

సారాంశం

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ ఖరారు, సెప్టెంబరు నుంచి షూటింగ్ ఊరించి ఊరించి ఫైనల్ గా ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీని నిర్మించనున్న చినబాబు

జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయ్యాక తదుపరి చిత్రం కూడా ఆ రేంజ్ ను మించి ఉండాలనే యోచనరలో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అందుకే చాలాకాలంవరకు కథను ఎంపిక చేసుకోలేకపోయాడు. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అనుకున్నా అది చాలాకాలం వర్కవుట్ కాలేదు. కానీ చివరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు శుభవార్త అందింది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ కావడం ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్తే మరి.

ఫైనల్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాలని ఎంతో కాలం గా అభిమానులు ఎదురు చూస్తున్న అభిమానుల ఆశ నెరవేరింది. వీరి ఆకాంక్షలు ఈ ఏడాదిలోనే (2017) సఫలం కానున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రం ను నిర్మించ నున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే ఈ తొలి చిత్రాన్ని తమ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించటం, నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ప్రకటించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. 2017 సెప్టెంబర్ లో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆ..ఆ, వంటి ఘనవిజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఈ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ నున్న చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

PREV
click me!

Recommended Stories

Dhurandhar 2: అతిక్ అహ్మద్‌కి ఉగ్రవాదులతో లింక్‌లు.. సంచలన నిజాలు బయటపెట్టిన డీజీపీ, వామ్మో ఇంత జరిగిందా ?
Chiranjeevi-Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా? టాలీవుడ్‌లోనే అదొక సంచలనం