
9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం కావడంతో ఖైదీ నెంబర్ 150 వ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఆ అంచనాలకు తగ్గట్లుగా ఇటీవల కంప్లీట్ అయిన సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఖైదీ నెంబర్ 150 వ చిత్రంతో చిరంజీవి రికార్డుల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది . ఏకంగా ఈ చిత్రాన్ని 18 మంది సెన్సార్ సభ్యులు చూడటం , సినిమా అయిపోయాక చిరంజీవి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు అని చెప్పడం తో ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది .
చిరంజీవి ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా రాయ్ లక్ష్మీ ఐటెం సాంగ్ లో అందాలను ఆరబోసిందట . వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది .
ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 4 న విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని స్పెషల్ ఐటెమ్ సాంగ్ రత్తాలు సాంగ్ రిలీజైన కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యింది. ఇప్పటికే మెగా స్టార్ స్టామినాను చాటిచెప్పిన ఆడియోపాటలకు ఈ పాట కూడా తోడై మెగా ఫ్యాన్స్ కు ముందే కొత్త సంవత్సరం పండుగ తీసుకొచ్చింది.