NTR: అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి ధైర్యాన్ని నింపిన ఎన్టీఆర్‌.. ఫోన్‌కాల్‌ వీడియో వైరల్‌

Published : Jun 29, 2022, 06:32 PM ISTUpdated : Jun 29, 2022, 06:52 PM IST
NTR: అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి ధైర్యాన్ని నింపిన ఎన్టీఆర్‌.. ఫోన్‌కాల్‌ వీడియో వైరల్‌

సారాంశం

అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానితో ఎన్టీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. వారికి ధైర్యాన్ని నింపారు. త్వరగా కోలుకోవాలని, తాము అండగా ఉంటామని తెలిపారు.

యంగ్‌ టైగర్‌, పాన్‌ ఇండియా స్టార్‌ ఎన్టీఆర్‌(Ntr).. అభిమానుల కోసం ఏమైనా చేస్తారు. వారు ఆపదలో ఉన్నారంటే ఆదుకోవడంలోనూ ముందే ఉంటారు. అభిమానుల యోగక్షేమాలు సైతం పట్టించుకుంటూ వారికి మరింత దగ్గరవుతున్నారు. అభిమానుల ఆరాధ్య నటుడయ్యారు. తాజాగా అనారోగ్యంతో బాధ పడుతున్న అభిమానితో మాట్లాడారు ఎన్టీఆర్‌. ఫోన్‌లో మాట్లాడి ధైర్యాన్ని నింపాడు. వారి అమ్మతోనూ మాట్లాడి ఆమెకి భరోసాని, ధైర్యాన్నిచ్చారు. తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందన్నారు Jr Ntr. 

జనార్థన్‌ అనే అభిమాని అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జనార్థన్‌ ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. దీంతో అభిమాన హీరోతో మాట్లాడాలనుకున్నారు. అంతే అభిమాన సంఘం నాయకుల ద్వారా ఎన్టీఆర్‌కి విషయం చేరింది. తన అభిమాని జనార్థన్‌ అనారోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న తారక్‌.. వెంటనే ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని, దేవుడిపై భారం వేయాలని తెలిపారు.

ఇందులో ఆయన చెబుతూ, `జనార్థన్‌ నేను ఎన్టీఆర్‌ని మాట్లాడుతున్నా. నువ్వు త్వరగా కోలుకుని వస్తే, మనం త్వరలోనే కలుద్దాం. దేవుడిపై నమ్మకం, భారం పెట్టు. మేం అందరం నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. త్వరగా కోలుకుని వచ్చేయి, నిన్ను చూడాలని నాక్కూడా ఉంది` అని తెలిపారు తారక్‌. వాళ్ల అమ్మగారితోనూ ఫోన్‌  మాట్లాడుతూ ఆమెకి భరోసా ఇచ్చారు. తన సహకారం ఉంటుందని చెప్పారు. తన కోడుకు కోసం తాను కూడా ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తారక్‌ వారి అమ్మతో మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. 

ఇక ఎన్టీఆర్‌ ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్‌`తో మెరిసిన విషయం తెలిసిందే. ఇందులో కొమురం భీమ్‌ పాత్రలో నటించి అబ్బురపరిచారు. అద్భుతమైన నటనతో మంత్రముగ్దుల్ని చేశారు. నట విశ్వరూపం చూపించారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో `ఎన్టీఆర్‌ 30` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ లో రెగ్యూలర్‌ షూటింగ్‌ జరుపుకోబోతుందని తెలుస్తుంది. మరోవైపు `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తోనూ ఓ సినిమా చేయనున్నారు ఎన్టీఆర్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్