డైవర్స్ రూమర్స్ పై స్టార్స్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి క్లారిటీ.. రివర్స్ పోస్ట్ తో తికమక..

Published : Jun 29, 2022, 05:40 PM IST
డైవర్స్ రూమర్స్ పై స్టార్స్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి క్లారిటీ.. రివర్స్ పోస్ట్ తో తికమక..

సారాంశం

విడాలకు వార్తాలపై ఎట్టకేలకే  సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్‌లు పెట్టి ఈ వార్తలను కొట్టి పడేశారు. 

చిత్ర పరిశ్రమలో డైవర్స్ వార్తలు, మ్యారేజ్‌ వార్తలు తరచూ హాట్‌ టాపిక్ అవుతున్నాయి. అందులో భాగంగా టాలీవుడ్‌ స్టార్‌ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవిలపై కూడా విడాకుల వార్తలు వినిపించాయి. ఈ ఇద్దరు డైవర్స్ తీసుకోబోతున్నారని, గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నారనే వార్తలు వినిపించాయి. ఎట్టకేలకే ఈ వార్తలపై సింగర్స్ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్‌లు పెట్టి ఈ వార్తలను పరోక్షంగా కొట్టి పడేశారు. 

హేమచంద్ర ఇన్‌స్టాలో పేర్కొంటూ, `నా ఇండిపెండెంట్‌ సాంగ్స్ కంటే ఇలాంటి అనసవర, పనికి రాని చెత్త సమాచారం ఎక్కువగా విస్తరిస్తుంది` అని పేర్కొన్నారు. అయితే ఆయన తన పోస్ట్ ని రివర్స్ లో పోస్ట్ చేయడం విశేషం. ఈ సందర్భంగా శ్రావణ భార్గవితో చీర్స్ అంటూ ట్యాగ్‌ ఇవ్వడం మరో విశేషం. ఇందులో తాను రూపొందించిన `వన్‌ లవ్‌` అనే ఒరిజినల్ ఇండిపెండెంట్‌ సాంగ్‌ ని చూడండి అంటూ పేర్కొన్నారు. 

మరోవైపు హేమచంద్ర భార్య,సింగర్‌ శ్రావణ భార్గవి సైతం ఇన్‌స్టాలో విడాలకుపై క్లారిటీ ఇస్తూ, ఇటీవల కొన్ని రోజులుగా నా యూట్యూబ్‌ ఛానెల్‌ వ్యూస్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు. ఇప్పుడు ఎక్కువగా వర్క్ చేస్తున్నా. సంపాదన కూడా పెరిగింది. రైటో,రాంగో మీడియా నాకో వరం` అని పేర్కొంది. ఇందులో హేమచంద్రని ట్యాగ్‌ చేసింది. మొత్తంగా తమ విడాకుల రూమర్స్ కి ఈ విధంగా చెక్‌ పెట్టారీ స్టార్‌ సింగర్స్. 

పలు టీవీషోస్‌లో సింగింగ్‌ కాంపీటీషన్స్ లో పాల్గొని సింగర్స్ గా ఎదిగారు హేమచంద్ర, శ్రావణ భార్గవి. `స్వరాభిషేకం`, `సరిగమప` వంటి పలు సింగింగ్‌ షోస్‌లో కలిసి పాడారు. స్నేహితులయ్యారు. స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో పెద్దల అంగీకారంతో 2009లో మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరికి ఓ పాప ఉంది. 

హేమచంద్ర `పరుగు` చిత్రంలో `హృదయం ఓర్చుకోలేనిది`, `నాలో నేనేనా`(బాణం), `బొమ్మాళి`(బిల్లా), `ప్రేమదేశం యువరాణి`(శక్తి) వంటి పాటలు పాడి పాపులర్‌ అయ్యారు. ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్‌`లో దోస్తీ తెలుగు వెర్షన్‌ పాడిన విషయం తెలిసిందే. మరోవైపు `సింహమంటి చిన్నోడే`(సింహా), `బద్రీనాథ్‌`, `కెమెరామెన్‌ గంగతో రాంబాబు`, `తీన్‌ మార్‌`, `సోలో` వంటి చిత్రాల్లో పాటలు పాడారు శ్రావణ భార్గవి. ఇప్పుడు కెరీర్‌ పరంగా ఫుల్‌ బిజీగా ఉన్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?