అంచనాలు ఆకాశానికి చేర్చిన కమల్ 'విక్రమ్' ఫస్ట్ లుక్ పోస్టర్

Published : Jul 10, 2021, 08:40 PM IST
అంచనాలు ఆకాశానికి చేర్చిన కమల్ 'విక్రమ్' ఫస్ట్ లుక్ పోస్టర్

సారాంశం

నేడు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. విక్రమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల అంచనాలు ఆకాశానికి చేర్చింది. కమల్, విజయ్ సేతుపతి తో పాటు మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ లతో కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ కేక పెట్టించింది. 

విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరున్న లోకేష్ కనక రాజ్ ఖైదీ చిత్రంతో భారీ హిట్ కొట్టారు. హీరో కార్తీ నటించిన ఖైదీ ఎటువంటి కమర్షియల్ అంశాలు లేకుండా ప్రయోగాత్మకంగా తెరకెక్కి మంచి విజయాన్ని నమోదు చేసింది. తెలుగు, తమిళ భాషలలో హిట్ తిలక్ తెచ్చుకున్న ఈ మూవీ లోకేష్ ఇమేజ్, పాపులారిటీ పెంచి వేసింది. దీనితో స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశాలు ఆయన దక్కించుకుంటున్నారు. 


విజయ్ హీరోగా లోకేష్ తెరకెక్కించిన మాస్టర్ మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ వసూళ్ల పరంగా బాగానే రాబట్టింది. కాగా మాస్టర్ చిత్ర విడుదలకు ముందే విశ్వ నాయకుడు కమల్ హాసన్ హీరోగా విక్రమ్ అనే చిత్రాన్ని ప్రకటించారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కమల్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారని సమాచారం. 


ఇక నేడు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. విక్రమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల అంచనాలు ఆకాశానికి చేర్చింది. కమల్, విజయ్ సేతుపతి తో పాటు మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ లతో కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ కేక పెట్టించింది. గొప్ప నటులుగా పేరున్న ముగ్గురు నటులతో లోకేష్ ఎలాంటి సినిమా తెరకెక్కించనున్నాడనే ఆసక్తి పెరిగిపోయింది. ఇక విక్రమ్ సినిమాను రాజ్ కమల్ పిక్చర్స్ బ్యానర్ పై కమల్ స్వయంగా నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Klin Kaara: రామ్‌ చరణ్‌ పేరు మర్చిపోయిన క్లీంకార.. వార్నింగ్‌ ఇచ్చినా వదలని చిరంజీవి మనవరాలు
Maa Inti Bangaram 5 Days Collections: బాక్సాఫీసు వద్ద సమంత ర్యాంపేజ్‌.. 5 రోజుల్లో మా ఇంటి బంగారంకి అదిరిపోయే వసూళ్లు