తారక్ తనయుడి అక్షరాభ్యాసం,ఇప్పుడే చేయటానికి కారణం

Surya Prakash   | Asianet News
Published : Jun 01, 2021, 07:37 AM IST
తారక్ తనయుడి అక్షరాభ్యాసం,ఇప్పుడే చేయటానికి కారణం

సారాంశం

 తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆదివారం భార్గవ్ రామ్ కు అక్షరాభ్యాసం చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ నివాసంలోనే ఈ కార్యక్రమం జరిగిందట. 

జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో తాజాగా ఓ శుభకార్యం జరిగినట్లు సమాచారం. అదేమిటంటే. ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్‌కు ఆదివారం అక్షరాభ్యాసం నిర్వహించారట. ఈ పంక్షన్ ని తమ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నట్లు తెలుస్తోంది.మొదట ఈ పంక్షన్ ని తిరుపతి లో కానీ, బాసరలోనే చేద్దామనుకున్నారు.అయితే కరోనా తీవ్రంగా ఉన్న ఈ పరిస్దితుల్లో రిస్క్ చేయటం అనవసరం అని ఎన్టీఆర్ భావించి ఈ నిర్ణయం తీసుకుని ఇంట్లోనే చేసేసారు. అటు ఎన్టీఆర్ తరపు కొందరు, భార్య లక్ష్మీ ప్రణతి వైపు మరికొందరుతో ఈ ఈవెంట్ కన్నులపండగగా జరిగిందిట.   తారక్ పురోహితుడుతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడంతో ఈ విషయంబయటకు వచ్చింది. దీనిపై ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. 
  
అలాగే ఇంత హఠాత్తుగా ఈ వేడక చేయటానికి రీజన్ ఉందిట. సాధారణంగా అక్షరాభ్యాసం మూడో ఏటనో ఐదో ఏటనో నిర్వహిస్తుంటారు. ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ 2018 జూన్ 14న జన్మించాడు. అంటే అతడికి ఇప్పుడు మూడో సంవత్సరం నడుస్తోంది. మరో 15 రోజులైతే నాలుగో ఏడాదిలోకి అడుగు పెట్టేస్తాడు. అందుకే అక్షరాభ్యాసం ఇప్పుడు నిర్వహించినట్లు చెప్పుతున్నారు.  

 ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. అయితే ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకుని తన అభిమానులకు శుభవార్త చెప్పిన ఎన్టీఆర్ ఇంట్లో తాజాగా ఈ శుభకార్యం జరిపించారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

PREV
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌