ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!

Google News Follow Us

సారాంశం

ఎన్టీఆర్, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చాయి. సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలిపారు.

ఎన్టీఆర్‌ హీరోగా ప్రస్తుతం `దేవర` చిత్రం రూపొందుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న చిత్రమిది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఉరమాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కొరటాల. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. పాన్‌ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని రిలజీ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంపై భారీ బజ్ నెలకొంది. బిజినెస్‌ పరంగానూ ఇప్పట్నుంచి సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. 

ఇదిలా ఉంటే నెక్ట్స్‌ ఎన్టీఆర్‌.. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన `సలార్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 22న విడుదల కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాపై ఫోకస్‌ పెట్టబోతున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా క్రేజీ అప్‌డేట్‌ చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ సంబరపడే వార్తని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ వెల్లడించారు. 

ఎన్టీఆర్‌ మూవీని వచ్చే ఏడాది ప్రారంభిస్తారట. తారక్‌ నటిస్తున్న `దేవర` చిత్రం విడుదలైన తర్వాత తమ సినిమా స్టార్ట్ అవుతుందని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే టైమ్‌లో ఈ సినిమాని ప్రారంభిస్తామని, ఇది భారీ యాక్షన్‌ మూవీగా ఉండోబోతుందని తెలిపారు. ఫ్యాన్స్ పండగ చేసుకునే, ఎన్టీఆర్‌ ఇమేజ్‌ నెక్ట్స్ లెవల్ కి వెళ్లేలా ప్రశాంత్‌ నీల్‌ ఈ ప్రాజెక్ట్ ని ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on