తమన్ ను తట్టుకోలేకపోతున్నాం, గగ్గోలు పెడుతున్న థియేటర్ యజమానులు, అసలేం జరిగిందంటే..?

By Mahesh Jujjuri  |  First Published Sep 29, 2023, 6:59 PM IST

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. కాపీట్యూన్స్ అంటూ ఎన్నో విమర్షలు చేశారు.. కాని తాజాగా తమన్ పై మరో కంప్లైయింట్ రేజ్ అయ్యింది. అది కూడా థియేటర్ యజమానుల నుంచి వస్తున్నాయి. ఇంతకీ వాళ్లు ఏమంటున్నారంటే..?



సినిమాకు సక్సెస్ లో ఎవరి భాగం ఎంతో తెలియదు కాని.. పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా  అంతకంటే ఎక్కువే కీలకం. హీరోకు సరైన ఇంట్రడక్షన్ పడాలన్నా.. ఎలివేషన్‌ సీన్లు  పండాలన్నా.. దానికి అదిరిపోయే మ్యూజిక్ ఉండాలి.  ఇక సినిమాలో ఎమోషన్ సీన్స్ పండాలన్నా.. క్యారెక్టర్స్‌లో ఎమోషన్‌ బయటకు రావాలన్నా.. మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఈకాలంలో అది కూడా సౌత్ లో.. ఈ జనరేషన్ కు తగ్గట్టు.. అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వాలంటే ముగ్గురేముగ్గరు గట్టిగా కనిపిస్తున్నారు. వారు ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు థియేటర్లు ఆడియన్స్ కూర్చోవడం కష్టం. వారే దేవిశ్రీ ప్రసాద్, తమన్, అనిరుద్. ఇక ఇప్పుడు తమన్ గురించి మాట్లాడాలి అంటే.. అఖండాకు ఇచ్చిన మ్యూజిక్ గురించి తెలిసిందే. ముఖ్యంగా బాలయ్య ఎలివేషన్ సీన్స్ అయితే అదరగొట్టాడనే అనాలి. ఈక్రమంలో 

కాపీ మరకలు ఎన్ని వచ్చినా.. థమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌కు థియేటర్‌లే వచ్చే రెస్పాన్స్‌ అరాచకం. కేవలం థమన్‌ మ్యూజిక్‌ వల్లే ఎన్నో సినిమాల్లో ఎన్నో సీన్లు ప్రాణం పోసుకున్నాయి అనడంలో ఆశ్చర్యం లేదు.. అతిశయోక్తి లేదు. అఖండనే అందుకు బెస్ట్ ఎక్జాంపుల్.  బాలయ్య స్క్రీన్‌ ప్రజెన్స్‌కు థమన్‌ మ్యూజిక్‌ తోడై థియేటర్‌లు దద్దరిల్లిపోయాయి. మరీ ముఖ్యంగా థమన్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌కు సౌండ్‌ బాక్సులు పేలిపోయాయని థియేటర్‌ల నుంచి కంప్లైట్స్‌ కూడా వచ్చాయి. ఇక తాజాగా తమన్ బోయపాటికి మరో మంచి హిట్టు అందించాడు.. రామ్ పోతినేని కాంబినేషన్ లో చేసిన స్కంద మూవీతో.. థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.

Latest Videos

 

Someone needs to make an effort to control Mr. Thaman. These audio decibel levels are outrageous. An inconvenience to both us theater owners whose equipment is getting affected and the audience who are complaining about the volume levels.

— GowriShankar Theatre (@GSCinemasGnt)

బోయాపాటి, థమన్‌ కాంబోలో వచ్చిన స్కంద బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అరుపులు పెట్టించేలా ఉందని.. చెవులు దద్దరిల్లిపోతున్నాయని అంటున్నారు ఆడియన్స్. బాలయ్యకు ఇచ్చిన మాస్ ఎలివేషను ను మించి రామ్ ను పైకి లేపారు.  అఖండకు ఏమాత్రం తగ్గని స్థాయిలో సౌండ్ పొల్యూషన్ సృష్టించాడని ఆడియెన్స్‌ వెల్లడిస్తున్నారు. కాగా తాజాగా స్వయంగా గుంటూరుకు చెందిన గౌరీ శంకర్ థియేటర్ యాజమాన్యం అయితే ట్విట్టర్లో దీని గురించి ఓ స్పెషల్ స్టోరీనే రాసుకొచ్చారు.

థమన్‌ను ఎవరైనా కంట్రోల్ చేయాలని.. లేదంటే థియేటర్లలో సౌండ్ సిస్టమ్స్ తట్టుకోవడం కష్టమని, స్కంద సినిమా ప్రదర్శన సందర్భంగా సౌండ్ పొల్యూషన్ తట్టుకోలేక ప్రేక్షకులే సౌండ్ తగ్గించాలని విన్నపాలు చేశారని.. ఇది ప్రేక్షకులతో పాటు థియేటర్ల యాజామాన్యాలకు కూడా ఇబ్బందిగా మారిందని ట్విట్టర్‌లో ఆ సదరు సంస్థ రాసుకొచ్చింది. ఇక ఇటీవలే స్కంద ప్రమోషన్‌లలో రామ్‌ పోతినేని.. థమన్‌ మ్యూజిక్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. థమన్‌ మ్యూజిక్‌కు స్పీకర్స్‌ బ్లాస్ట్‌ అవడం పక్కా. అన్నాడు. ఆయన అన్నట్టే జరుగుతోంది. రామ్ ఇచ్చిన  ఎలివేషన్‌ కు ఏమాత్రం తీసుపోకుండా మ్యూజిక్ అందించాడు తమన్. 

 

click me!