చికిత్స కోసం యూరప్ వెళ్లనున్న ఎన్టీఆర్

Published : Sep 16, 2017, 05:09 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
చికిత్స కోసం యూరప్ వెళ్లనున్న ఎన్టీఆర్

సారాంశం

జై లవకుశ విడుదల అనంతరం యూరోప్ కు ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్న తారక్ యూరప్ లో డీ టాక్సినేషన్ థెరపీ, తర్వాత మలేషియా వెళ్లి మార్షల్ ఆర్ట్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'జై లవ కుశ' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని సినిమా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. మరో వైపు ఆయన హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్ తెలుగు' రియాల్టీ షో కూడా చివరి దశకు చేరుకోవడంతో అందుకు సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు.

 

సెప్టెంబర్ 21వ తేదీన ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. మరో వైపు 24వ తేదీతో 'బిగ్ బాస్ తెలుగు' తొలి సీజన్ ముగియబోతోంది. ఇంతకాలం ఈ రెండు షూటింగులతో తీరిక లేకుండా గడుపుతున్న కాస్త రిలీఫ్ కాబోతున్నారు.

 

‘జై లవ కుశ' తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉండనుంది. జనవరి చివర్లో లేదా, లవ కుశ' షూటింగ్ ముగిసిన వెంటనే ఎన్టీఆర్ యూరప్ వెలుతున్నట్లు సమాచారం. అక్కడే దాదాపు ఓ నెల రోజులు మకాం వేయనున్నారని, శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించుకునేందుకు 'డీ టాక్సినేషన్ థెరపీ' చేయించుకుంటాడని తెలుస్తోంది.

 

ఈ విదేశీ ట్రిప్‌కు ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి వెళతారని సమాచారం. ఇంత కాలం షూటింగు బిజీ కారణంగా భార్య, కొడుకుతో సరిగా సమయం గడపలేక పోయిన ఎన్టీఆర్ దాదాపు నెల రోజుల పాటు ఇక్కడ థెరపీ తీసుకుంటూ రిలాక్స్ అవుతారట.

 

యూరఫ్‌లో 'డీ టాక్సినేషన్ థెరపీ' ముగిసిన అనంతరం ఆయన మలేషియా వెళతారని, అక్కడ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటారని తెలుస్తోంది. పిబ్రవరిలో ప్రారంభం అయ్యే త్రివిక్రమ్ సినిమా కోసమే ఈ ట్రైనింగ్ తీసుకుంటారని టాక్. మొత్తానికి జూనియర్ జై లవకుశ రిలీజ్ తర్వాత భారీ ప్లాన్స్ సెట్ చేసేసుకున్నాడన్నమాట.

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?