
ఇక భారతీయుడులో వడివేలు పాత్ర చాలా పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు సీక్వెల్ చేయటానికి మళ్లీ వడివేలు తీసుకురావటం శంకర్ కు ఇష్టం లేదు. ఎందుకంటే శంకర్ కు, వడివేలు కి మధ్య చాలా వివాదాలు నడిచాయి. ఈ నేపధ్యంలో వడివేలుని రీప్లేస్ చేసేలా..వెన్నెల కిషోర్ ని సీన్ లోకి తెస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.
తెలుగులో బ్రహ్మానందం తరువాత అంత పాపులర్ అయిన హాస్య నటుడు వెన్నెల కిషోర్. వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న ఆయనకు ప్రముఖ క్రేజీ దర్శకుడు శంకర్ నుంచి ఊహించని ఆఫర్ వచ్చిందని తెలియటంతో అందరూ కంగ్రాట్స్ తెలియచేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సెట్ వర్క్ మొదలైంది. వచ్చే ఏడాది మొదట్లో లాంఛనంగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక దర్శకుడు శంకర్ ఈ సినిమా కోసం 180 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తమిళ సిని వర్గాల సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా మొదలై శరవేగంగా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో టీమ్ ఉందట. శంకర్ – కమల్ కాంబినేషన్ అంటే నయనతార తప్పకుండా అంగీకరిస్తుందనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే .. కమల్ తో నయనతార చేసే మొదటి సినిమా ఇదే అవుతుంది.