
జూనియర్ ఎన్టీఆర్ కు నైట్ పార్టీలు బాగా అలవాటు. నైట్ పార్టీలు అంటే.. బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయడం కాదు. తన సినిమాకు సబంధించిన టీమ్స్ కాని.. సినిమా ఓపెనింగ్స్.. సక్సెస్ ను ఎంజాయ్ చేయాలన్నా.. తారక్ వెంటనే డిన్నర్ పార్టీ పెట్టేస్తాడు. ఈక్రమంలోనే గత రాత్రి కూడా తారక్ తన ఇంట్లో నైట్ పార్టీ ఇచ్చాడు. ఎన్టీఆర్ 30 సినిమా ఓపెనింగ్ జరిగి.. షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈక్రమంలో ఎన్టీఆర్ పార్టీ హాట్ టాపిక్ గా మారింది.
ఎన్టీఆర్30 లో హాలీవుడ్ టెక్నీషియన్స్ జాయిన్ అయ్యారు. అందులో అమెజాన్ ఇంటర్నేషనల్ స్టూడియోస్ వైస్ చైర్మెన్ జేమ్స్ కూడా ఉన్నారు. ఆయనకు ఫెర్వెల్ కోసం ఎన్టీఆర్ తన ఇంట్లో పార్టీ అరైంజ్ చేశారు. ఈ పార్టీ కోసం ఎన్టీఆర్ 30 టీమ్ తో పాటు పలువురు టాలీవుడ్ స్టార్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యారు.
ఇక ఎన్టీఆర్ పార్టీకి.. కొరటాల టీమ్ తో పాటు.. టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు.. రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మైత్రీమేకర్స్.. కూడా పాల్గొన్నారు. ఈ పార్టీలో ఎన్టీఆర్ వైఫ లక్ష్మీ ప్రణీత కూడా పాల్గొన్నారు. నైట్ పార్టీకి సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఫోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కు ఓ నోట్ కూడా రాశాడు తారక్. స్నేహితులు మరియు శ్రేయోభిలాషులతో ఈ సాయంత్రం చక్కగా గడిపాను. జేమ్స్ మరియు ఎమిలీలను కలుసుకోవడం చాలా బాగుంది. మీ మాటను నిలబెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్.. ఈ పార్టీలో మాతో పాటు జాయన్ అయినందుకు.. మా విందు అందుకున్నందుకు ధన్యవాదాలు అన్నారు ఎన్టీఆర్.
ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు ఎన్టీఆర్. పాన్ ఇండియ స్టార్ గా తారక్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆస్కార్ సాధించడంతో హాలీవుడ్ లో సైతం తారక్ పేరు మారుమోగిపోయింది. ఆస్కార్ వేడుకల్లో అంత మంది హాలీవుడ్ స్టార్స్ ఉండగా.. ఎక్కువగా ఆస్కార్ వేదిక దగ్గర చర్చించుకున్న పేరు ఎన్టీఆర్. ఈ రికార్డ్ సాధించిన మొదటి ఇండియన్ స్టార్ గా తారక్ పేరు నిలిచిపోయింది.
ఎన్టీఆర్ 30 షూటింగ్ సూపర్ పాస్ట్ గా జరుగుతోంది. కొరటాల టీమ్ లో హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్స్ కూడా జాయిన్ అయ్యారు. ఫస్ట్ షెడ్యూల్ లోనే అదిరిపోయే యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించారు. ఇక తారక్ పార్టీలో ఈ హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా జాయిన్ అయ్యారు. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ జోడీగా నటిస్తున్న ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. జాన్వీ ఈ సినిమాతోనే సౌత్ ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఈసినిమా తరువాత కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మూవీ చేయబోతున్నాడు ఎన్టీఆర్. వరుసగా పాన్ఇండియా సినిమాలు సెట్స్ ఎక్కించడానికి రెడీగా ఉన్నాడు. వీటితో పాటు హృతిక్ రోషన్ కాంబోలో.. బాలీవుడ్ లో వార్ 2 లో తారక్ కనిపిస్తాడని వార్త హల్ చల్ చేస్తోంది. అంతే కాదు బాలీవుడ్ లో డైరెక్ట్ మూవీ కూడా చేయబోతున్నట్టు టాక్.