గత నాలుగు రోజులుగా ...మీడియా అత్యుత్సాహంగా త్రివిక్రమ్ ని తప్పించి, ఆ ప్లేస్ లో కొరటాలని ఎన్టీఆర్ తీసుకువచ్చారంటూ ప్రచారం చేసేస్తోంది. త్రివిక్రమ్ రాసిన పొలిటికల్ స్క్రిప్టు మార్చమని ఎన్టీఆర్ అడిగాడని, మార్చాక అదీ నచ్చలేదని కారణం చూపెడుతోంది.
మీడియాలో వార్తలు కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. నిజమేనేమో అనిపిస్తాయి. అప్పుడప్పుడూ కొన్ని నిజాలు కూడా రూమర్స్ గా కనిపిస్తాయి.ఇదిగో ఈ వార్త కూడా అలాంటిదే. లేకపోతే ...అబ్బే...అలాంటిదేం లేదు అని నిర్మాత స్వయంగా చెప్పినా ఎన్టీఆర్, త్రివిక్రమ్ ప్రాజెక్టు మీద రూమర్స్ ఆగకపోవటం ఏమిటి. గత నాలుగు రోజులుగా ...మీడియా అత్యుత్సాహంగా త్రివిక్రమ్ ని తప్పించి, ఆ ప్లేస్ లో కొరటాలని ఎన్టీఆర్ తీసుకువచ్చారంటూ ప్రచారం చేసేస్తోంది. త్రివిక్రమ్ రాసిన పొలిటికల్ స్క్రిప్టు మార్చమని ఎన్టీఆర్ అడిగాడని, మార్చాక అదీ నచ్చలేదని కారణం చూపెడుతోంది.
వాస్తవానికి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా పట్టాలెక్కాల్సివుంది. అన్నీ ఓకేనే. ప్రకటన కూడా వచ్చేసింది. కానీ కాస్తంత లేటు అయ్యేసరికి ఇలాంటి వార్తలు మొదల్యయాయి. మీడియా వాళ్ల దృష్టిలో హఠాత్తుగా ఈ క్రీజీ ప్రాజెక్టు రకరకాల కారణాలతో వెనక్కి వెళ్లిపోయింది. వాళ్లు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు ఎన్టీఆర్ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి... ఉప్పెన డైరక్టర్ బుచ్చిబాబు, రెండోది కొరటాల శివ. వీళ్లిద్దరిలో ఒకరిని ఎంచుకుంటారట. కొరటాల వైపే మ్రొగ్గు చూపెడుతున్నాడట. తనకు జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరక్టర్ కు వెంటనే డేట్స్ ఇచ్చేయాలని ఆత్రుతపడుతున్నాడట.
అలాగే ఆ మధ్యన ఉప్పెన చూసి ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్.. బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తానని అన్నాడు. వెంటనే ఉత్సాహంగా బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్ కోసం ఓ కథ రెడీ చేసేసుకున్నాడు. అయితే ఎప్పుడు ఈ సినిమా మొదలు కావాలి. త్రివిక్రమ్ ప్రాజెక్టు తర్వాత అనుకున్నారంతా. కానీ త్రివిక్రమ్ తప్పుకోవటం వల్ల ఆ ప్లేస్ లో ఈ సినిమానే మొదలవుతోంది అనేస్తున్నారు. అయితే.. ఆ ప్రకటనా రాలేదు. దాంతో ఇప్పుడు కొరటాల శివ కూడా ఎన్టీఆర్ కు టచ్‌లోకి వచ్చాడని అంటున్నారు.
అయితే ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ కాంబోలో రూపొందుతున్న `ఆచార్య`తో బిజీగా ఉన్నాడు కొరటాల. కరోనా ఇబ్బందులు ఏమీ లేకుండా అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే...మే 13న విడుదల అవుతుంది. ఆ తరవాత... అల్లు అర్జున్ తో కొరటాల ఓ సినిమా చేయాలి. అయితే అల్లు అర్జున్ కంటే ముందు ఎన్టీఆర్ తో ప్రాజెక్టు మొదలెట్టేస్తారు అంటున్నారు. ఏదైమైనా త్రివిక్రమ్ ని తప్పించి అటు బుచ్చిబాబుని, ఇటు కొరటాల సీన్ లోకి తెస్తున్నారు. అయితే మీడియా రాసిన కథనాలు అన్ని నిజమయ్యేది ఎప్పుడు కనుక.