ఆ సినిమా చూసి ఎన్టీఆర్ తల్లి కన్నీరు పెట్టుకుందట!

Published : Jun 11, 2019, 08:35 PM IST
ఆ సినిమా చూసి ఎన్టీఆర్ తల్లి కన్నీరు పెట్టుకుందట!

సారాంశం

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ పలు చిత్రాల్లో కీలకమైన పాత్రల్లో నటించాడు. తనకు అవకాశం వచ్చిన ప్రతి పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్నాడు. సమీర్ కు జూ. ఎన్టీఆర్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ పలు చిత్రాల్లో కీలకమైన పాత్రల్లో నటించాడు. తనకు అవకాశం వచ్చిన ప్రతి పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్నాడు. సమీర్ కు జూ. ఎన్టీఆర్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్ గురించి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ గొప్ప నటుడని ప్రతి ఒక్కరూ చెప్పే విషయమే. కానీ యమదొంగ చిత్రం చూసిన తర్వాత ఎన్టీఆర్ తల్లి రియాక్షన్ దగ్గరగా చూశానని సమీర్ తెలిపారు. 

యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు అతడి తల్లి షాలిని ఎమోషనల్ అయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు అని సమీర్ తెలిపాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ అద్భుతమైన పెర్ఫామెన్స్ అందించాడు. ఆ చిత్రం ద్వారా తాను విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించగలనని ఎన్టీఆర్ నిరూపించుకున్నాడు. 

ఇక 2017లో విడుదలైన జై లవకుశ చిత్రంలో ట్రిపుల్ రోల్ లో నటించి మరోసారి ఎన్టీఆర్ అందరిని మెస్మరైజ్ చేశాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి