రవితేజ 'మహాసముద్రం' ఖాయమేనా!

Published : Jun 11, 2019, 07:38 PM IST
రవితేజ 'మహాసముద్రం' ఖాయమేనా!

సారాంశం

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం డిస్కో రాజా చిత్రంలో నటిస్తున్నాడు. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కుతోంది. 

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం డిస్కో రాజా చిత్రంలో నటిస్తున్నాడు. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం తర్వాత రవితేజ మరో ప్రాజెక్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో రవితేజ నటించేందుకు సిద్ధం అవుతున్నాడట. 

ఆర్ఎక్స్ 100 తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో నటించబోతున్నారు అంటూ పలు హీరోల పేర్లు వినిపించాయి. ఏది వర్కౌట్ కాలేదు. మహాసముద్రం టైటిల్ తో అజయ్ నాగ చైతన్యకు ఓ కథ వినిపించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఖాయం అనుకున్నారంతా. కానీ అది జరగలేదు. అదే కథకు రవితేజ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే అజయ్ భూపతి మహాసముద్రం మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీ అయిపోయాడని సమాచారం. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ మహా సముద్రం కోసం రెండు ట్యూన్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రవితేజ, అజయ్ భూపతి చిత్రంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి