అమెరికాలో ల్యాండ్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా అభిమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించారు. ఫ్యాన్స్ ను మీట్ అయిన సందర్భంగా చాలా ఎమోషనల్ అయ్యారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)పై అభిమానులు చూపించే ప్రేమపై ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతే ప్రేమను తారక్ కూడా అభిమానులపై చూపిస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ ఎంతటి గౌరవం, ప్రేమను పంచుతారో తెలిసిందే. తాజాగా ఆస్కార్ వేడుకల (Oscars 2023) కోసం అమెరికాకు వెళ్లిన తారక్ అభిమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కలవడం సంతోషంగా ఉందని తెలిపారు. అదేవిధంగా అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు కాస్తా భావోద్వేగం అవుతూ.. ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
తారక్ మాట్లాడుతూ.. ‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమను వర్ణించడం కష్టం. మీరందరూ చూపించే అభిమానికి వందరెట్ల అభిమానం నా గుండెల్లో ఉంది. మన మధ్య ఏ రక్తసంబంధం లేకపోయినా గొప్ప బంధంగా మారింది. నేను మీకు ఏం చేసి దగ్గరయ్యానో నాకూ తెలియడం లేదు. మీరు నాకు సొంత అన్నలకంటే ఎక్కువ. మీ ప్రేమకు ఒక్కటే చెప్పగలను. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇంకో జన్మంటూ ఉంటే ఈ అభిమానం కోసమే పట్టాలని కోరుకుంటున్నారు.’ అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. తారక్ మాటలకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆ మాటలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.
మరోవైపు ఫ్యాన్స్ తారక్ ఎమోషనల్ కామెంట్స్ కు స్పందిస్తున్నారు. ‘అభిమానులకే అభిమానిగా’ ఉంటున్న ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటూ నెట్టింట దుమ్ములేపుతున్నారు. ఆస్కార్ వేడుకల కోసం నిన్న అమెరికాకు వెళ్లిన తారక్ సమయం ఉన్నప్పుడల్లా ఫ్యాన్స్ ను కలుస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటికే RRR టీమ్ మొత్తం అమెరికాకు చేరుకున్న విషయం తెలిసిందే. తారక్ కొన్ని పర్సనల్ వర్క్స్ చూసుకొని నిన్న లాస్ ఏంజెల్స్ లో ల్యాండ్ అయ్యారు. ప్రస్తుతం ఆస్కార్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెడుతున్నారు.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్స్’ అవార్డ్స్ 2023 రేసులో ఉన్న విషయం తెలిసిందే. సెన్సేషనల్ సాంగ్ ‘నాటు నాటు’ Naatu Naatu ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్స్ కు నామినేట్ అయ్యింది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డును దక్కించుకోవడంతో ‘ఆస్కార్స్’ వరిస్తుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అలాగే ఆస్కార్స్ వేదికపై ‘నాటు నాటు’లైవ్ పెర్ఫామెన్స్ చేసే అవకాశమూ దక్కడం విశేషం. మార్చి 12న Oscars ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించారు. ఎంఎం కీరవాణీ సంగీతం అందించారు. డీవీవీ దానయ్య అందించిన ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
NTR Fan Of His Fans pic.twitter.com/orqdkYGLgf
— Vivace Media (@VivaceMedia)