బెడ్ పై బోర్లా పడుకొని తిప్పలు పడుతున్న అనసూయ.. జస్ట్ దాని కోసమే అంటూ!

Published : Mar 07, 2023, 02:57 PM IST
బెడ్ పై బోర్లా పడుకొని తిప్పలు పడుతున్న అనసూయ.. జస్ట్ దాని కోసమే అంటూ!

సారాంశం

స్టార్ యాంకర్ అనసూయ ఇంస్టాగ్రామ్ రీల్ చేశారు. సదరు వీడియో ఫ్యాన్స్ తో పంచుకుని ఆసక్తికర కామెంట్ చేశారు.   

అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన దిన చర్య తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. అనసూయ గ్లామరస్ ఫోటో షూట్స్ కి ఫేమస్. ఆమె యాంకరింగ్ మానేశాక ఫోటో షూట్స్ తగ్గించేశారు. గతంలో జబర్దస్త్ తో పాటు ఇతర షోలలో ధరించిన బట్టల్లో ఫోటోలు దిగిన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేవారు. అయితే రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. 

అనసూయ తాజాగా బెడ్ పై బోర్లా పడుకుని రొమాంటిక్ వీడియో చేసింది. కలుసుకోవాలని చిత్ర బీజీఎం బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండగా చిలిపి ఫోజులు ఇచ్చారు. అనసూయ ఈ వీడియోకి 'కేవలం ఒక రీల్ చేశాను. అంతకు మించీ ఏమీ లేదు' అంటూ కామెంట్ జోడించింది. అనసూయ వీడియో వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ఎప్పటిలానే క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

అనసూయ యాంకరింగ్ పూర్తిగా మానేసిన విషయం తెలిసిందే. ఇటీవల బుల్లితెర షోల మీద భయంకరమైన ఆరోపణలు చేసింది. షో నిర్వాహకులు టీఆర్పీ కోసం పనికిమాలిన పనులకు పాల్పడుతున్నారని అవి తనకు నచ్చక యాంకరింగ్ మానేసినట్లు పరోక్షంగా  చెప్పారు. అనసూయ ప్రధానంగా తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని టార్గెట్ చేయడం విశేషం. 

అలాగే నటిగా బిజీగా ఉన్న అనసూయకు యాంకరింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె చేతిలో లెక్కకు మించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అధికారికంగా పుష్ప 2, రంగమార్తాండ చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని సమాచారం. అనసూయ ఒక్క కాల్షీట్ కి రూ. 2 నుండి 3 లక్షలు తీసుకుంటున్నారట. పుష్ప 2లో అనసూయ విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ రోల్ పై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇటీవల అనసూయపై సోషల్ మీడియా ట్రోలింగ్ ఎక్కువైంది. దీనిపై అనసూయ యుద్ధమే చేస్తున్నారు. మితిమీరి ప్రవర్తించిన వారిమీద చర్యలకు పాల్పడుతున్నారు. ఆ మధ్య ఒక వ్యక్తి మీద ఫిర్యాదు చేసి జైలుపాలు చేసింది. నెటిజెన్స్ కామెంట్స్ ని సాధారణంగా సెలెబ్రిటీలు పట్టించుకోరు. అనసూయ మాత్రం రియాక్ట్ అవుతుంది. సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్