ఎన్టీఆర్ 'మహానాయకుడు' సినిమా ట్రైలర్ చూడండి!

By Udaya DFirst Published 16, Feb 2019, 6:13 PM IST
Highlights

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా మొదటి భాగం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా మొదటి భాగం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు రెండో భాగం 'మహానాయకుడు' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా సినిమా ట్రైలర్ ని 
విడుదల చేసింది చిత్రబృందం. 

''ఇచ్చిన ప్రతీమాట నిలబడాలి.. చేసిన ప్రతీపని కనపడాలి.. ఇన్ టైం.. ఆన్ డాట్'' అంటూ ఎన్టీఆర్ పాత్రలో ఉన్న బాలకృష్ణ పలికిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది

''చెప్పేటోళ్ళు ఉండాలి.. లేకపోతే ఆరు కోట్ల మంది ఆయన పక్కన ఉన్న ఒంటరోడు అయిపోతాడు'' అంటూ చంద్రబాబు క్యారెక్టర్ పలికిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 

''నిశ్శబ్దాన్ని చేతకానితనం అనుకోవద్దు.. మౌనం మారణాయుధంతో సమానం'' అంటూ బాలయ్య చెప్పడం ఆకట్టుకుంటోంది. 

''నేను రాజకీయాలు చేయడానికి రాలేదు.. మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను'' అంటూ చివరగా ఎన్టీఆర్ పలికిన డైలాగ్ అభిమానులు ఆకట్టుకుంటోంది. 

 

Last Updated 16, Feb 2019, 6:13 PM IST