NTR: అల్లూరి లేకుండా భీమ్ కి పరిపూర్ణత లేదు... సుధీర్ఘ లేఖలో ఎన్టీఆర్ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ 

Published : Mar 29, 2022, 12:48 PM IST
NTR: అల్లూరి లేకుండా భీమ్ కి పరిపూర్ణత లేదు... సుధీర్ఘ లేఖలో ఎన్టీఆర్ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ 

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ మూవీ భారీ విజయం సాధించగా... ఎన్టీఆర్ సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో తన కోస్టార్ చరణ్ పై ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.   

ఆర్ ఆర్ ఆర్ మూవీ (RRR Movie)భారీ విజయం సాధించింది. మూడు రోజుల్లో రూ. 500 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. అన్ని భాషల్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆదరణ దక్కించుకుంది. వీకెండ్ ముగిసే నాటికే ఆర్ ఆర్ ఆర్ బ్రేక్ ఈవెన్ కి చేరువైంది. వీక్ డే సోమవారం కూడా ఆర్ ఆర్ ఆర్ జోరు కొనసాగింది. ఓపెనింగ్స్ లో బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ చిత్రం నయా రికార్డ్స్ సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఓ సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. చిత్ర యూనిట్ తో పాటు అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

లేఖలో పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్ (NTR)... తన కోస్టార్ చరణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రామ్ చరణ్ ని ఎన్టీఆర్ ఆకాశానికి ఎత్తాడు. ఏకంగా ఆర్ ఆర్ ఆర్ మూవీలో భీం పాత్రకు చరణ్ చేసిన అల్లూరి పాత్రతోనే పరిపూర్ణత చేకూరిందన్నారు. అల్లూరి పాత్ర రామ్ చరణ్ కంటే బెటర్ ఇంకా ఎవరు చేయలేరన్న అభిప్రాయం వెల్లడించారు. ఇక చరణ్ లేకుండా ఆర్ ఆర్ ఆర్ ని ఊహించడం కూడా కష్టమే అని ఎన్టీఆర్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకరిపై మరొకరు ప్రేమ కనబరిచారు. ఇద్దరూ సొంత బ్రదర్స్ కంటే మిన్నగా మెలిగారు. తాజా లేఖతో చరణ్ (Charan) పై ఎన్టీఆర్ కి ఎంత అభిమానం ఉందో మరోసారి రుజువైంది. 

అలాగే దర్శకుడు రాజమౌళి (Rajamouli) తన కెరీర్ బెస్ట్ మూవీ ఇచ్చారన్నారు. తనలోని గొప్ప నటుడ్ని వెలికితీసి మరచిపోలేని చిత్రాన్ని ఇచ్చిన జక్కన్నకు ధన్యవాదాలు తెలిపారు. నిర్మాత డివివి దానయ్య, నటులు ఒలీవియా మోరిస్, అలియా భట్ తో పాటు సాంకేతిక నిపుణులకు, మీడియా, ఇతర చిత్ర పరిశ్రమలకు కూడా ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. ఇక లేఖ చివర్లో తన అభిమానులను ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. తనపై అభిమానులు చూపించే ప్రేమ మంచి చిత్రాలు చేయడానికి ప్రేరణ ఇస్తుందని వెల్లడించారు. 

ఎన్టీఆర్ రాసిన సుదీర్ఘమైన లేఖ వైరల్ గా మారింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ భారీ విజయంతో నాలుగేళ్ళ కష్టానికి ఫలితం దక్కినట్లైంది. కాగా ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలకు సిద్ధం అవుతున్నారు. వెంటనే దర్శకుడు కొరటాల శివ మూవీ షూట్ లో పాల్గొననున్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ప్రశాంత్ నీల్ చిత్రంతో పాటు బుచ్చిబాబు చిత్రాలు ఉన్నాయి. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ తో మూవీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే