Balakrishna Lagend: బాలయ్య కెరీర్ లోనే వసూళ్ల వర్షం కురిపించిన సినిమాకు 8 ఏళ్ళు

Published : Mar 29, 2022, 11:12 AM IST
Balakrishna Lagend: బాలయ్య కెరీర్ లోనే వసూళ్ల వర్షం కురిపించిన సినిమాకు 8 ఏళ్ళు

సారాంశం

బాలయ్య కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమాల్లో లెజండ్ ఒకటి. నందమూరి ఫ్యాన్ ను ఊర్రూతలూగించిన ఈ సినిమా.. బాలయ్య కెరీర్ లో కూడా ఓ మైలు రాయిగా మిగిలిపోయింది. భారీ కలెక్షన్స్ ను సాధించింది. 

బాలయ్య కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమాల్లో లెజండ్ ఒకటి. నందమూరి ఫ్యాన్ ను ఊర్రూతలూగించిన ఈ సినిమా.. బాలయ్య కెరీర్ లో కూడా ఓ మైలు రాయిగా మిగిలిపోయింది. భారీ కలెక్షన్స్ ను సాధించింది. 

బారీ ఫ్యాన్ ఫోలోయింగ్ ఉన్నా.. అప్పటి వరకు 20కోట్ల  వసూళ్ళు కూడా సాధించలేదు  బాలకృష్ణ సినిమాలు. కాని మహాద్భుతంలాంటి ఓ సినిమా మాత్రం ఏకంగా 40 కోట్లు షేర్ వసూలు చేసింది..అదే లెజెండ్. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఇది. వీరి కలయికలో సింహా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన సినిమా ఇది.

 2014 మార్చ్ 28న రిలీజ్ అయిన లెజెండ్ సినిమా 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. అప్పట్లో లెజెండ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం నమోదు చేసుకుంది. ఈ సినిమా  ఏకంగా 1000 రోజుల పాటు థియేటర్స్ లో దిగ్విజయంగా నడిచింది. ఈ సినిమాలో బాలయ్య డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఉర్రూతలూగారు. ఇప్పటికీ బాలయ్య ఫ్యాన్స్ కు మర్చిపోలేని సినిమాగా లెజెండ్ నిలిచిపోయింది. 

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా హీరోయిన్లు రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ లు కనిపించారు. ఈ సినిమాలో విలన్ గా జగపతిబాబు పాత్రను ఎప్పటికీ మర్చిపోలేము. జగపతిబాబు కెరీర్ ను కంప్లీట్ గా మార్చేసిన సినిమా ఇది. భారీ అంచనాల మధ్య వచ్చి మంచి విజయం సాధించింది లెజెండ్ ఫైనల్ కలెక్షన్స్ చూస్తే..లెజెండ్ సినిమాకు 8 ఏళ్ల కిందే 32 కోట్ల బిజినెస్ జరిగింది. సింహా సూపర్ హిట్ కావడంతో ఆ నమ్మకంతోనే బాలయ్య సినిమాల్లోనే హైయ్యస్ట్ బిజినెస్ చేసారు. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా  అద్భుతమైన ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. బాలయ్య కెరీర్‌లో మొదటి 40 కోట్ల షేర్ అందుకున్న సినిమా ఇది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే