గాయాలతో ఎన్టీఆర్.. జోష్ లో అభిమానులు

Published : Jul 23, 2018, 11:36 AM IST
గాయాలతో ఎన్టీఆర్.. జోష్ లో అభిమానులు

సారాంశం

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఫోటో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్, నాగబాబులు గాయాలతో కనిపిస్తున్నారు. నాగబాబుని చూస్తూ టెన్షన్ పడుతోన్న ఎన్టీఆర్ లుక్ చాలా ఎమోషనల్ గా ఉంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న నూతన చిత్రం 'అరవింద సమేత'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. కథకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. కథ ప్రకారం సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఫోటో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్, నాగబాబులు గాయాలతో కనిపిస్తున్నారు. నాగబాబుని చూస్తూ టెన్షన్ పడుతోన్న ఎన్టీఆర్ లుక్ చాలా ఎమోషనల్ గా ఉంది. ఈ ఫోటో చూసి అభిమానులు వంద కోట్లు సాధించే సినిమా అంటూ జోష్ లోకి వెళ్లిపోతున్నారు. ఈ ఫోటో ఎడిటింగ్ రూమ్ నుండి లీక్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఫోటో లీక్ అయిన కొద్ది  గంటల్లోనే సోషల్ మీడియాలో భీభత్సం సృష్టిస్తోంది. సినిమాలో నాగబాబు ఒక వర్గానికి చెందిన ఫ్యాక్షనిస్ట్ లీడర్ గా కనిపించనున్నాడని టాక్. అయన కొడుకుగా ఎన్టీఆర్ కనిపిస్తాడని అంటున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ అత్యంత వేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోందని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?