
స్టార్స్ ఏమి చేసినా అభిమానులకు పండగలా ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ గురించిన వీడియోలు,వార్తలుకు అయితే డిమాండ్ ఓ రేంజిలో ఉంటుంది. ఈ విషయం సదరు స్టార్స్ కు తెలుసు. వాళ్లు కూడా అందుకు తగినట్లే రచ్చ రచ్చ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటూంటారు. అయితే నయనతార ఇలాంటివాటికి దూరం. తన నటన,సినిమాలతోనే వార్తలుకు ఎక్కాలనుకుంటుంది. అయితే ఆమె ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోతూంటాయి కదా.అలా రీసెంట్ గా ఆమె కేరళలో మిడ్ నైట్ చేసిన రచ్చ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే అదేందో చూద్దాం.
నయనతార తన స్నేహితులతో కలిసి మిడ్ నైట్‌లో ఒక ఫుట్ పాత్ పై ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేయడం ఆశ్చర్యపరిచింది. తన స్నేహితులతో కలిసి నయన్ ఐస్ క్రీమ్ ని ఎంజాయ్ చేస్తూ ఎంతో జోవియల్ గా ఆనందంగా కనిపించింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా మారింది. నయనతార స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోని అభిమానులు పదే పదే తరచి చూస్తున్నారు.
ఆ వీడియోలో నయన్ తో పాటు మరో ఇద్దరు కూడా కనిపించారు. వారు నయన్ స్నేహితులు లేదా కజిన్స్ అని తెలుస్తుంది. అర్ధరాత్రి రోడ్డు సైడ్ ఐస్ క్రీమ్ తింటూ లేట్ నైట్ ని ఎంజాయ్ చేస్తున్న వారికీ.. ఆ ఐస్ క్రీమ్ షాప్ ఎదురుగానే నయనతార బ్యానర్ ఒకటి కనిపించింది. దీంతో మిగిలిన ఇద్దరు వ్యక్తులు.. నయనతారతో ఫన్నీ వీడియోని రికార్డు చేసారు.
అలాగే నయనతార తన స్నేహితుల మధ్య సరదా ఆట వీడియో ఎంతో ఫన్నీగా ఉంది. నయనతార వ్యక్తిగత జీవితంలో ఎంత సింపుల్ గా ఉంటారో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే..నయనతార నటించిన `జవాన్` బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది.ఆమె నటిస్తున్న కుముద చిత్రీకరణ పూర్తయింది. మన్ననగట్టి సిన్స్ 1960 అనే చిత్రంలోను నటిస్తోంది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలకు సైన్ చేసారు. అలాగే తెలుగులో మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం అయితే ఈ హీరోయిన్ సినిమాల విషయంలో కొంచెం వేగం తగ్గించినట్లు తెలుస్తుంది.