ఎన్టీఆర్‌ 30 సెట్‌లోకి తారక్‌.. ట్వీట్‌ వైరల్‌

By Aithagoni RajuFirst Published Apr 1, 2023, 6:34 PM IST
Highlights

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న `ఎన్టీఆర్‌30` షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైన విసయం తెలిసిందే. తాజాగా సెట్లోకి తారక్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆయన ట్వీట్‌ వైరల్‌ అవుతుంది.
 

ఎన్టీఆర్‌ ఆల్మోస్ట్ ఏడాది తర్వాత షూటింగ్‌ సెట్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఆయన చివరగా `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటించిన విషయం తెలిసిందే. ఇది రిలీజ్‌ అయి కూడా ఏడాది దాటింది. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `ఎన్టీఆర్‌30` చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌ గా ప్రారంభమైంది. తాజాగా షూటింగ్‌ సెట్‌లోకి అడుగుపెట్టారు ఎన్టీఆర్‌. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో అభిమానులతో ఓ వీడియోని షేర్‌ చేశారు. 

ఏప్రిల్‌ 1న ఆయన ఎన్టీఆర్‌ 30 సెట్‌లోకి అడుగుపెట్టారు. ఇందులో కొరటాల శివ వేసిన ఓ గ్రాండియర్‌ సెట్‌లో ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి దాన్ని తారక్‌ తన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. అయితే సెట్‌ కోట లోపలి భాగాన్ని తలపించేలా ఉంది. అయితే ఇది రాత్రి పార్టీ సాంగ్‌ కోసం వేసిన సెట్‌ తరహాలో ఉండటం గమనార్హం. ఇక తారక్‌ బ్యాక్‌ నుంచి ఇందులో కనిపించారు. ఆయన కూడా పూల పూల షర్ట్ ధరించాడు. మొత్తంగా ఓ పాటని ఇందులో చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. 

ఈ వీడియోని పంచుకుంటూ `కొరటాల శివతో మళ్లీ సెట్స్ లోకి రావడం గొప్పగా ఉంది` అని పేర్కొన్నారు ఎన్టీఆర్‌. కొరటాల శివతో కలిసి మరోసారి పనిచేయడం పట్ల తారక్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనిపై అభిమానులు స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నారు. రంగు రంగుల షర్ట్ ఎన్టీఆర్‌ మాస్‌ లోడింగ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అసలైన మాస్‌ రెడీ అవుతుందంటున్నారు. ప్రస్తుతం తారక్‌ షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. 

Great to be on sets again with Koratala Siva ! pic.twitter.com/uKNFNtKyZO

— Jr NTR (@tarak9999)

ఎన్టీఆర్‌, కొరటాల శివ గతంలో `జనతా గ్యారేజ్‌` చిత్రంలో నటించారు. అది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మరోసారి వీరి కాంబినేషన్‌లో `ఎన్టీఆర్‌30` చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే హాలీవుడ్‌ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. స్టంట్స్ మాస్టర్‌ కెన్నీ బేట్స్, వీఎఫెక్స్ సూపర్‌ వైజర్‌గా హాలీవుడ్‌కి చెందిన బ్రాడ్‌ మిన్నిచ్‌  వర్క్ చేస్తుండటం విశేషం. దీంతో ఈ సినిమా అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో రూపొందుతుందని అర్థమవుతుంది. ఇక ఈ సినిమాని ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై కళ్యాణ్‌ రామ్‌, మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా కోస్టర్‌ ఏరియా నేపథ్యంలో వదిలేయబడ్డ ఓ గ్రామానికి చెందిన కథతో రూపొందిస్తున్నారు. అక్కడ భయం ఎరుగని ప్రజలకు భయాన్ని పరిచయం చేయడం అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు కొరటాల ఇటీవల ఓపెనింగ్‌ రోజు తెలిపిన విషయం తెలిసిందే. 
 

click me!