ఎన్టీఆర్‌ భారీగా ఫిల్మ్ స్టూడియో నిర్మాణం.. ఎన్టీఆర్‌30 షూటింగ్‌ అందులోనే?

Published : May 16, 2023, 01:38 PM IST
ఎన్టీఆర్‌ భారీగా ఫిల్మ్ స్టూడియో నిర్మాణం.. ఎన్టీఆర్‌30 షూటింగ్‌ అందులోనే?

సారాంశం

`ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. ఇప్పుడు పాన్‌ ఇండియాని మించి, గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. తాజాగా ఆయన ఫిల్మ్ స్టూడియో రంగంలోకి అడుగుపెడుతున్నాడట. ఇదిప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.   

ఎన్టీఆర్‌ సినిమాలు తప్పితే వ్యక్తిగత జీవితం పూర్తి ప్రైవేట్‌గా ఉంచుతాడు. ఎలాంటి విషయాలను ఆయన బయటకు రానివ్వరు. ఆయన సినిమాలో సంపాదించినది చాలా వరకు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెడుతున్నారని అంటున్నారు. ఆ మధ్య తన భార్య ప్రణతి కోసం ఓ బిజినెస్‌ని స్టార్ట్ చేస్తున్నారని అన్నారు. కానీ దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా ఓ షాకిచ్చే వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. ఎన్టీఆర్‌ సినిమాల కోసమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆయన భారీగా ఫిల్మ్ స్టూడియో నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. 

ఇప్పటికే టాలీవుడ్‌లో రామానాయుడు, అల్లు అరవింద్‌, అక్కినేని, మహేష్‌ ఫ్యామిలీలకు ఫిల్మ్ స్టూడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్‌ కూడా ఫిల్మ్ స్టూడియో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్‌కి శంషాబాద్‌ సమీపంలో భారీగా ల్యాండ్‌ ఉందని, ఆ ల్యాండ్‌లో ఓ ప్రొడక్షన్‌ సంస్థతో కలిసి ఫిల్మ్ స్టూడియో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం అది నిర్మాణ దశలో ఉందని, మరికొన్ని రోజుల్లో పూర్తి కానుందని అంటున్నారు. 

 అద్దెకు కెమెరాలు, లైట్లు, ఇతర షూటింగ్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్లు అందించే అతిపెద్ద సంస్థ తాహెర్‌ సినీ టెక్నీక్‌ సంస్థతో కలిసి ఎన్టీఆర్‌ ఈ ఫిల్మ్ స్టూడియోని ప్లాన్‌ చేశారట. ఇందులో ఆయన భారీగానే ఇన్వెస్ట్ చేశారని తెలుస్తుంది. అందులో భాగంగా ఓ ఐదు అంతస్థుల నిర్మాణం చేపట్టారని, ప్రస్తుతం తారక్‌ నటిస్తున్న `ఎన్టీఆర్‌30` సినిమా షూటింగ్‌ అందులోనే జరుగుతుందని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ చాలా వరకు ఆ స్టూడియోలోనే జరుగుతుందని సమాచార.  దీనికి సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్‌  వచ్చే వారం ప్రారంభం కానుందని టాక్‌. మరి ఎన్టీఆర్‌ ఫిల్మ్ స్టూడియో నిర్మాణంలో భాగస్వామి అనే వార్తలో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.కానీ ఇది నెట్టింట వైరల్‌ అవుతుంది.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఎన్టీఆర్‌30`లో నటిస్తున్నారు. జాన్వీ కపూర్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ చిత్రాలను నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. పాన్‌ ఇండియన్‌ ప్రాజెక్ట్ గానే దీన్ని ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్. కోస్టర్‌ ఏరియాలో గుర్తింపుకి నోచుకోని ఓ తీర ప్రాంతంలో జరిగే కథాంశంతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది
చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?