ఆట నాది.. కోటీ మీది.. ఎన్టీఆర్‌ హోస్ట్ గా `ఎవరు మీలో కోటీశ్వరులు`.. ప్రోమో అదుర్స్

Published : Mar 13, 2021, 11:46 AM IST
ఆట నాది.. కోటీ మీది.. ఎన్టీఆర్‌ హోస్ట్ గా `ఎవరు మీలో కోటీశ్వరులు`.. ప్రోమో అదుర్స్

సారాంశం

`ఎవరు మీలో కోటీశ్వరులు` ప్రోమో వచ్చేసింది. దీనికి హోస్ట్ ఎవరో తెలిసిపోయింది. ఎన్టీఆర్‌ హోస్ట్ గా అధికారిక ప్రకటన వచ్చేసింది. శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా `ఎవరు మీలో కోటీశ్వరులు` ప్రోమో విడుదల చేశారు. 

`ఎవరు మీలో కోటీశ్వరులు` ప్రోమో వచ్చేసింది. దీనికి హోస్ట్ ఎవరో తెలిసిపోయింది. ఎన్టీఆర్‌ హోస్ట్ గా అధికారిక ప్రకటన వచ్చేసింది. శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా `ఎవరు మీలో కోటీశ్వరులు` ప్రోమో విడుదల చేశారు. ఇందులో ఆయన కొమురంభీమ్‌ గెటప్‌లో కనిపించడం విశేషం. తాజాగా విడుదలైన ప్రోమో ట్రెండ్‌ అవుతుంది. 

జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానుంది. గతంలో మాటీవీలో ప్రసారమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాల్గో సీజన్‌ రాబోతుంది. గతంలో నాగార్జున, చిరంజీవి హోస్ట్ లు చేయగా, ఇప్పుడు ఎన్టీఆర్‌ హోస్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో ఎన్టీఆర్‌ `ఎవరు మీలో కోటీశ్వరులు` గురించి వివరించారు. `ఇక్కడ కథ మీది, కల మీది.. ఆట నాది.. కోటీ మీది.. రండి గెలుద్దాం` అంటూ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. చివరగా `మీ రామారావు. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు` అని ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. ఇది త్వరలోనే ప్రారంభం కానుందట.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే