14ఏళ్లప్పుడు అత్యాచారానికి గురయ్యాః సంచలన విషయం వెల్లడించిన సల్మాన్‌ మాజీ గర్ల్ ఫ్రెండ్‌ సోమీ అలీ

Published : Mar 13, 2021, 08:32 AM IST
14ఏళ్లప్పుడు అత్యాచారానికి గురయ్యాః సంచలన విషయం వెల్లడించిన సల్మాన్‌ మాజీ గర్ల్ ఫ్రెండ్‌ సోమీ అలీ

సారాంశం

బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సోమీ అలీ ఇప్పుడు ఓ స్వచ్ఛంద సంస్థని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తాను చిన్నప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతున్నాయి. 

కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ మాజీ గర్ల్ ఫ్రెండ్‌ సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 14ఏళ్ల వయసులో అత్యాచారానికి గురైనట్టు వెల్లడించారు. బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సోమీ అలీ ఇప్పుడు ఓ స్వచ్ఛంద సంస్థని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తాను చిన్నప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతున్నాయి. 

పాకిస్థాన్‌లో ఉన్నప్పుడు తాను ఐదేళ్ల వయసులో, అలాగే తొమ్మిదేళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యిందట.  14 ఏళ్ల వయసులో అత్యాచార బాధితురాలిగా మారానని తెలిపింది. ఈ విషయం బయటపెట్టడానికి ఇంతకాలం పట్టిందని సోమీ చెప్పింది. `తొలిసారి పాకిస్థాన్‌లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా. అప్పుడు నా వయసు ఐదేళ్లు. పనివాళ్ల క్వార్టర్స్‌లో ఇలాంటి ఘటనలు మూడుసార్లు జరిగాయి. నేను మా పేరెంట్స్ కి ఈ విషయం చెప్పాను. వాళ్లు చర్యలు తీసుకున్నారు.

ఆ తర్వాత `ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పకు` అని చెప్పారు. అయితే, అవే ఆలోచనలు నా మెదడును నాలుగేళ్ల పాటు పట్టి పీడించాయి. నేనేమైనా తప్పు చేస్తున్నానా? అమ్మానాన్నలు ఎందుకలా చెప్పారు? అని అనుకున్నా. ఇండియా, పాకిస్థాన్‌లో సంప్రదాయాలు ఒకేలా ఉంటాయి. వారు నన్ను రక్షిస్తున్నా, నేను అర్థం చేసుకోలేకపోయాను. మళ్లీ అలాంటి ఘటనే 9 ఏళ్ల వయసులో జరిగింది. ఆ తర్వాత మరోసారి 14 ఏళ్ల వయసులో అత్యాచార బాధితురాలిగా మారిపోయా. మూడేళ్ల క్రితం ఇలాంటి వాటి గురించి మాట్లాడడం మొదలుపెట్టానని, 14 ఏళ్లుగా ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తూ ఇప్పటికీ మాట్లాడకపోతే తప్పు చేసిన దానిని అవుతాను` అని పేర్కొంది. 

పాకిస్థాన్‌కి చెందిన సోమీ అలీ మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది. 1992లో హిందీలోకి నటిగా ఎంట్రీ ఇస్తూ `బులండ్‌` చిత్రంలో నటించింది. కానీ ఇది విడుదల కాలేదు. అదే ఏడాది అక్షయ్‌ కుమార్‌తో `ఖిలాడి` చిత్రంలో మెరిసింది. ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా వరుసగా `ఆంత్‌`, `కృష్ణన్‌ అవతార్‌`, `యార్‌ గద్దర్‌`, `తేస్రా కౌన్‌?`, `ఆవు ప్యార్‌ కరేన్‌`, `ఆందోళన్‌`, `మాఫియా`, `చుప్‌` చిత్రాల్లో నటించింది. 

ఈ క్రమంలోనే ఆమె సల్మాన్‌తో డేటింగ్‌ చేసింది. దాదాపు ఎనిమిదేళ్లపాటు వీరిద్దరు ఘాటు రొమాన్స్ లో మునిగి తేలారు. అప్పట్లో ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదిలాఉంటే సినిమాలకు ఫుల్‌స్టాప్‌  పెట్టిన సోమీ అలీ `నో మోర్‌ టియర్స్` అనే ఎన్జీఓని నడిపిస్తుంది. అత్యాచార బాధితులను, లైంగిక వేధింపులకు గురయ్యే పిల్లలను రక్షిస్తుంది. వారిని చేరదీసి ధైర్యాన్ని నింపుతుంది. వారికి న్యాయం జరిగేలా చూస్తుంది. ఈ క్రమంలో సోమీ తన జీవితంలో జరిగిన ఘోర ఘటనలను వెల్లడించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం