ఎన్టీఆర్‌ హోస్ట్ `ఎవరు మీలో కోటీశ్వరులు` ప్రోమో.. గుండె బరువెక్కిపోతుంది..

Published : Aug 01, 2021, 01:42 PM IST
ఎన్టీఆర్‌ హోస్ట్ `ఎవరు మీలో కోటీశ్వరులు` ప్రోమో.. గుండె బరువెక్కిపోతుంది..

సారాంశం

ఎన్టీఆర్‌ హోస్ట్ గా ప్రసారమయ్యే ఈ రియాలిటీ షో ప్రోమో వచ్చేసింది. ఫ్రెండ్‌షిప్‌ డే కానుకగా ఆదివారం విడుదల చేశారు.  ఎన్టీఆర్‌ హోస్ట్ ఈ షోలో ప్రోమో ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు ఆలోచింప చేస్తుంది.

గత కొన్ని నెలలుగా ఊరిస్తున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` అప్‌డేట్‌ వచ్చేసింది. ఎన్టీఆర్‌ హోస్ట్ గా ప్రసారమయ్యే ఈ రియాలిటీ షో ప్రోమో వచ్చేసింది. ఫ్రెండ్‌షిప్‌ డే కానుకగా ఆదివారం విడుదల చేశారు.  ఎన్టీఆర్‌ హోస్ట్ ఈ షోలో ప్రోమో ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు ఆలోచింప చేస్తుంది. స్ఫూర్తివంతంగా నిలుస్తుంది. ఎడ్యూకేట్‌ చేసేలా ఉంది. జస్ట్ ప్రోమోనే ఈ రేంజ్‌లో ఆకట్టుకుంటే ఇక షో ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. 

చదువుల విలువని, కరోనా కష్టకాలంలో ప్రజల కష్టాలను ప్రతిబింబించేలా ఉందీ ప్రోమో. ఓ టీచర్‌ 25లక్షలు గెలుచుకున్నాక అతను తన స్టూడెంట్‌కి సహాయం చేయాలనుకోవడం గుండె బరువెక్కేలా చేస్తుంది. ఫైనల్‌గా ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు.ఇక్కడ కథ మీది, కల మీది ఆట నాది. రండీ ఎవరు మీలో కోటీశ్వరుడు` అని ఎన్టీఆర్‌ చెప్పడం గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. త్వరలో ఈ షో ప్రసారం కానుందని తెలిపింది. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానున్న విషయం తెలిసిందే. ఎప్పుడో ప్రసారం కావాల్సిన ఈ షో కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ నెలలోనే ప్రారంభం కాబోతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా