ఎన్టీఆర్ కి హ్యాండిచ్చి చరణ్ కి జై కొట్టిన కియారా.. కారణం అదేనట

Published : Aug 01, 2021, 12:51 PM IST
ఎన్టీఆర్ కి హ్యాండిచ్చి చరణ్ కి జై కొట్టిన కియారా.. కారణం అదేనట

సారాంశం

ఎన్టీఆర్ కి జంటగా కియారా అద్వానీని సెట్ చేయాలని కొరటాల భావించారు. గతంలో వీరిద్దరూ కలిసి నటించని నేపథ్యంలో మంచి కాంబినేషన్ అవుతుందని ఆశపడ్డారు. అయితే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి కియారా నో చెప్పారట.

బాలీవుడ్ భామ కియారా అద్వానీ తెలుగులో చేసింది రెండు చిత్రాలే. రెండూ స్టార్స్ నటించిన పెద్ద చిత్రాలు కావడంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. టాలీవుడ్ లో ఆమెకు ఫ్యాన్ బేస్ కూడా ఉంది. మహేష్ భరత్ అనే నేను, రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రాలలో ఆమె నటించారు. బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ నేపథ్యంలో టాలీవుడ్ పై ఫోకస్ తగ్గించారు. ఈ మధ్య టాలీవుడ్ స్టార్ హీరోల బెస్ట్ ఛాయిస్ గా కియారా మారారు. కారణం ఆమెకు హిందీతో పాటు తెలుగులో కూడా ఇమేజ్ ఉంది. 


కాగా ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ తదుపరి చిత్రాలు ప్రకటించారు. ఎన్టీఆర్ కొరటాల శివతో చరణ్ శంకర్ తో ప్రాజెక్ట్స్ చేయనున్నారు. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కనున్నాయి. దీనితో ఎన్టీఆర్ కి జంటగా కియారా అద్వానీని సెట్ చేయాలని కొరటాల భావించారు. గతంలో వీరిద్దరూ కలిసి నటించని నేపథ్యంలో మంచి కాంబినేషన్ అవుతుందని ఆశపడ్డారు. అయితే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి కియారా నో చెప్పారట. దానికి కారణం చరణ్-శంకర్ మూవీ అని తెలుస్తుంది. 


ఈ రెండు ప్రాజెక్ట్స్ దాదాపు ఒకేసారి సెట్స్ పైకి వెళ్లే సూచనలు కనిపిస్తుండగా ఎన్టీఆర్ మూవీ ఓకె చేస్తే, చరణ్ చిత్రాన్ని వదులుకోవాల్సి వస్తుంది. దానితో పాటు చరణ్ కి కియారా మంచి దోస్త్, ఉపాసనతో కూడా కియారా మంచి పరిచయం ఉంది. ఇక శంకర్ లాంటి దర్శకుడు సినిమాలో నటించాలని ఏ హీరోయిన్ కి అయినా కలగా ఉంటుంది. ఈ సమీకరణాల నేపథ్యంలో ఎన్టీఆర్ మూవీకి నో చెప్పిన కియారా, చరణ్ ప్రాజెక్ట్ ఓకె చేసిందట. దీనిపై కియారా బర్త్ డే నాడు అధికారిక ప్రకటన రావడం జరిగింది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?