రాజ్ కుంద్రా అరెస్ట్ చట్టబద్దమే... ఆధారాలు నాశనం చేస్తున్నందుకే అరెస్ట్

By team teluguFirst Published Aug 1, 2021, 1:35 PM IST
Highlights

రాజ్ కుంద్రా లాయర్ ఆరోపణలలో నిజం లేదన్న పోలీసుల తరుపు న్యాయవాది అరుణ పై.. రాజ్ కుంద్రాతో పాటు రియాన్ తోర్పె కు సెక్షన్ 41ఏ సీఆర్పీసీ యాక్ట్ క్రింద నోటీసులు జారీ చేసినట్లు జడ్జికి తెలియజేశారు. 

రాజ్ కుంద్రా అరెస్ట్ చట్ట విరుద్ధమని ఆయన తరపున న్యాయవాది వాదిస్తున్న నేపథ్యంలో ముంబై పోలీసుల తరపున న్యాయవాది కోర్ట్ లో వివరణ ఇచ్చారు. రాజ్ కుంద్రా తోపాటు ఆయన అనుచరులు ఆధారాలు నాశనం చేస్తున్న నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు వివరించారు. తన క్లయింట్ రాజ్ కుంద్రాకు అసలు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన అరెస్ట్ చట్ట వ్యతిరేకమని రాజ్ కుంద్రా లాయర్ జడ్జికి విన్నవించారు. 


రాజ్ కుంద్రా లాయర్ ఆరోపణలలో నిజం లేదన్న పోలీసుల తరుపు న్యాయవాది అరుణ పై.. రాజ్ కుంద్రాతో పాటు రియాన్ తోర్పె కు సెక్షన్ 41ఏ సీఆర్పీసీ యాక్ట్ క్రింద నోటీసులు జారీ చేసినట్లు జడ్జికి తెలియజేశారు. రాజ్ కుంద్రా నోటీసులను స్వీకరించడానికి నిరాకరించగా, రియాన్ నోటీసులు తీసుకున్నట్లు అరుణ ఫ్రై విన్నవించారు. 


ఇక రాజ్ కుంద్రా తో పాటు ఆయన అనుచరులు ఆధారాలు నాశనం చేస్తున్నారని. వాట్స్ చాట్స్, కంటెంట్ డిలీట్ చేస్తూ ఆధారాలు లేకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేశారని అరుణ తెలియజేశారు. రాజ్ కుంద్రా లాప్ టాప్ తో పాటు, హాట్ షాట్స్, బాలీ ఫేమ్ యాప్స్ నుండి పోర్న్ కంటెంట్ సీజ్ చేసినట్లు లాయర్ వెల్లడించారు. రాజ్ కుంద్రా బెయిల్ పిటీషన్ కొట్టివేసిన బాంబే  కోర్ట్, అతని కస్టడీ పొడిగించడం జరిగింది. 
 

click me!