కన్ఫమ్‌ః `ఎవరు మీలో కోటీశ్వరుడు` అఫీషియల్‌.. ఛానెల్‌ మారింది.. టైటిలూ మారింది..

Published : Mar 07, 2021, 09:21 PM ISTUpdated : Mar 07, 2021, 09:22 PM IST
కన్ఫమ్‌ః `ఎవరు మీలో కోటీశ్వరుడు` అఫీషియల్‌.. ఛానెల్‌ మారింది.. టైటిలూ మారింది..

సారాంశం

జెమినీ టీవీ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. ఇందులో విశేషం ఏంటంటే గతంలో స్టార్‌ మాలో ప్రసారమైన ఈ షో హక్కును జెమినీ టీవీ దక్కించుకోవడం.  మరోవైపు హోస్ట్ కూడా మారారు. గతంలో నాగార్జున, చిరంజీవి హోస్ట్ లుగా వ్యవరించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ హోస్ట్ గా దీన్ని నిర్వహించబోతున్నారు.

`మీలో ఎవరు కోటీశ్వరులు` షోకి అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌ వచ్చింది. జెమినీ టీవీ ఈ రోజు దీన్ని అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో ఇందులో `ఎవరు మీలో కోటీశ్వరులు. మీ జీవితాలని మార్చే గేమ్ షో , మీ ఆశలని నిజం చేసే గేమ్ షో "ఎవరు మీలో కోటీశ్వరులు " త్వరలో మీ  జెమినీ టీవీ లో రాబోతుంది సిద్ధంగా ఉండండి` అని జెమినీ టీవీ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. ఇందులో విశేషం ఏంటంటే గతంలో స్టార్‌ మాలో ప్రసారమైన ఈ షో హక్కును జెమినీ టీవీ దక్కించుకోవడం. 

మరోవైపు హోస్ట్ కూడా మారారు. గతంలో నాగార్జున, చిరంజీవి హోస్ట్ లుగా వ్యవరించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ హోస్ట్ గా దీన్ని నిర్వహించబోతున్నారు. కాకపోతే హోస్ట్ ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అంతేకాదు టైటిల్‌ కూడా మారింది. గతంలో `మీలో ఎవరు కోటీశ్వరులు` అని ఉండేది. ఇప్పుడు `ఎవరు మీలో కోటీశ్వరులు` అని మార్చారు. ఈ చిన్న చిన్న మార్పులతో ఈ రియాలిటీ షో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎన్టీఆర్‌పై ప్రోమోని షూట్‌ చేశారు. దీనికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. త్వరలో కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఎంట్రీలను జెమినీ టీవీ ఆహ్వానించింది. 

రెండో సారి ఎన్టీఆర్‌ టీవీ షోలో మెరవబోతున్నారు. ఇప్పటికే ఆయన `బిగ్‌బాస్‌` మొదటి సీజన్‌కి హోస్ట్ గా చేశారు. ఇప్పుడు ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. ఈ షో కోసం ఎన్టీఆర్‌ భారీగానే రెమ్యూనరేషన్‌ తీసుకోబోతున్నాడట. ఇదిలా ఉంటే దాదాపు 120 దేశాల్లో ఈ షో విజయవంతం కావడం విశేషం.  మొదటి మూడు సీజన్లకి నాగార్జున హోస్ట్ చేయగా, నాల్గో సీజన్‌కి చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఐదో సీజన్‌కి ఎన్టీఆర్‌ హోస్ట్. త్వరలో ఈ ప్రోమో విడుదల చేయబోతున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు