RRR Movie: రాజమౌళి కోసం ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 10, 2021, 09:25 AM IST
RRR Movie: రాజమౌళి కోసం ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది ?

సారాంశం

సినీ అభిమానుల్లో అక్కడ చూసిన RRR మ్యానియా కనిపిస్తోంది. గురువారం విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వైల్డ్ ఫైర్ లా సోషల్ మీడియాలో వ్యాపించింది. రాంచరణ్, ఎన్టీఆర్ సాహసాలు.. యాక్షన్ స్టంట్స్, స్వాతంత్ర పోరాట యోధులుగా ఇద్దరి లుక్స్ గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు.

సినీ అభిమానుల్లో అక్కడ చూసిన RRR మ్యానియా కనిపిస్తోంది. గురువారం విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వైల్డ్ ఫైర్ లా సోషల్ మీడియాలో వ్యాపించింది. రాంచరణ్, ఎన్టీఆర్ సాహసాలు.. యాక్షన్ స్టంట్స్, స్వాతంత్ర పోరాట యోధులుగా ఇద్దరి లుక్స్ గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. కొమరం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ చెలరేగిపోయారు. 

ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ట్రైలర్ తో అర్థం అవుతోంది.ట్రైలర్ లో ప్రతి బిట్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. ట్రైలర్ విడుదలతో ఈ చిత్రంపై అంచనాలు విస్ఫోటనంలా వ్యాపించాయి. Rajamouli ఇండియా వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు. 

గురువారం ముంబైలో ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ జరిగింది. రాజమౌళి, ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవ్ గన్, డివివి దానయ్య హాజరయ్యారు. రాంచరణ్ తన మరదలి వివాహ వేడుక కారణంగా హాజరు కాలేదు. తదుపరి జరగబోయే కార్యక్రమాలకు చరణ్ హాజరవుతారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ మీడియా ఎన్టీఆర్ కి పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించింది. 

ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి నవ్వులు పూయించారు. ఆర్ఆర్ఆర్ చిత్రీకరణకు దాదాపు మూడేళ్ళ సమయం పట్టింది. ఈ మూడేళ్ళలో మీరు ఎన్ని చిత్రాలు వదులుకున్నారు అని ప్రశ్నించారు. 'ఈ మూడేళ్ళలో నేను ఆర్ఆర్ఆర్ పైనే ఫోకస్ పెట్టాను. మరో చిత్రం గురించి ఆలోచించలేదు. అయినా రాజమౌళితో సినిమా చేస్తుంటే నాకు ఇంకెవరు ఆఫర్ ఇస్తారు అని ప్రశ్నించాడు ఎన్టీఆర్. దీనితో అక్కడున్న వారందరిలో నవ్వులు విరిశాయి. 

రాజమౌళితో సినిమా అంటే హీరోలకు పెద్ద టాస్క్. కమిటెడ్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది. బాహుబలి రెండు భాగాల కోసం ప్రభాస్ ఐదేళ్ల సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ ఐదేళ్లలో ప్రభాస్ మరే ఇతర చిత్రం చేయలేదు. ఆర్ఆర్ఆర్ కోసం రాంచరణ్, ఎన్టీఆర్ కూడా అంతే. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యాక ఇద్దరు హీరోలు తమ తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు. 

Also Read: RRR:ఎన్టీఆర్ లుక్,డైలాగ్స్ పై నార్త్ ఇండియన్స్ షాకింగ్ కామెంట్స్

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్