
టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ‘ఆర్ఆర్ఆర్’(RRR)తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రాలపైనే ఫోకస్ పెట్టాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత NTR30లో నటించనున్నట్టు ప్రకటించిన విసయం తెలిసిందే. అయితే నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇప్పడు అప్పుడు అంటూ ప్రచారాలు జరుగుతున్నా.. ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు.
తాజాగా ‘ఎన్టీఆర్ 30’ షూటింగ్ పై ఎన్టీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు నెలలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు వార్తలు వచ్చినా ఫైనల్ గా సెప్టెంబర్ రెండో వారం నుంచి షూటింగ్ ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే పూర్తి చేయనున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ లోని సెట్ కూడా రెడీగా ఉంది. షూటింగ్ ప్రారంభమైనా ఆరు లేదా ఏడు నెలల్లోనే సినిమాను పూర్తి చేయనున్నారు. వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నారు.
దర్శకుడు కొరటాల శివ కూడా చిత్ర స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రొమాంటిక్, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించున్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఈ కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రంపై అభిమానులు హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మూవీలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించనున్నట్టు టాక్. ఒక ఫారెస్ట్ మాఫియాను అంతం చేయాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థి నాయకుడిగా ఎన్టీఆర్ ను చూపించనున్నాడు కొరటా. సుధాకర్ మిక్కిలినేని మరియు నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఎన్టీఆర్ 30ని నిర్మిస్తున్నారు.