
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) - మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ ‘సీతా రామం’ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ క్రేజీ అప్డేట్స్ ను అందిస్తూ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, పాటలకు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. తాజాగా ‘సీతారామం’ ట్రైలర్ కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ట్రైలర్ కూడా అద్భుతమైన వ్యూస్ ను దక్కించుకుంటోంది.
అయితే, Sita Ramam Trailerపై తాజాగా నేచరల్ స్టార్ నాని అద్భుతమైన సమీక్షను అందించారు. ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ట్వీటర్ వేదికన ‘సీతారామం’ టీంకు బెస్ట్ విషెస్ తెలిపారు. ‘చిత్రంలోని నటీనటుల పెర్ఫామెన్స్, సంగీతం, విజువల్స్ మరియు చిన్న చిన్న నైపుణ్యాలు ఆకట్టుకుంటున్నాయి’ అని తెలిపారు. సస్పెన్స్ ఎలిమెంట్స్, రొమాంటిక్ సీన్స్ కూడిన ‘సీతారామం ట్రైలర్’ కచ్చితంగా సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తోందన్నారు. మరోవైపు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే స్పందన లభిస్తోంది.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రను పోషిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వం సరికొత్తగా అనిపిస్తోంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు భాషలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీ.ఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.