ఆచార్య వైఫల్యం మొత్తం కొరటాల మీదకు నెట్టేస్తావా... చిరుపై ఓ వర్గం ఫైర్!

By Sambi ReddyFirst Published Jul 25, 2022, 5:59 PM IST
Highlights

ఆచార్య కారణంగా చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ మధ్య విబేధాలు తలెత్తాయనిపిస్తుంది. ఆ సినిమా డిజాస్టర్ కాగా నిర్మాతలతో పాటు దర్శకుడు కొరటాల నష్టపోయారు. తాజాగా చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ కొరటాల గురించేనని సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. 
 

చిరంజీవి-రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య డిజాస్టర్ అయ్యింది. రెండో రోజే థియేటర్స్ నుండి వెళ్ళిపోయిన ఈ మూవీ భారీ నష్టాలు మిగిల్చింది. సినిమాను ఎక్కువ ధర చెల్లించి కొన్న బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. ఈ క్రమంలో నష్టాలు భర్తీ చేయాలని ఆందోళనకు దిగారు. ఈ సినిమా ఫైనాన్సియల్ మేటర్స్ తో తలదూర్చిన కొరటాల అందరికంటే ఎక్కువ నష్టపోయారు. అప్పటి వరకు సంపాదించిన ఆస్తులు అమ్మి బయ్యర్లకు చెల్లించారు. 

ఈ పరిణామం చిరంజీవికి బ్యాడ్ నేమ్ తెచ్చింది. నిజానిజాలు తెలుసుకోకుండా యాంటీ ఫ్యాన్స్ చిరంజీవిని ఏకిపారేశారు. ఆచార్య విషయంలో కొరటాలను ముంచేశారని విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలు చిరంజీవి-కొరటాల మధ్య దూరం పెంచాయని తాజా ఘటనతో అర్థమవుతుంది. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని తెలుగులో ప్రెజెంట్ చేస్తున్న చిరంజీవి ఆ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. నిన్న లాల్ సింగ్ చద్దా ట్రైలర్ విడుదల కాగా... ఈ ఈవెంట్ లో అమీర్ ఖాన్, చిరంజీవి, నాగ చైతన్య పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఏం చేస్తే ప్రేక్షకులు చప్పట్లు కొడతారో అలాంటి చిత్రాలే  చేస్తాను. అప్పుడప్పుడు పరిస్థితులు నా చేతిలో ఉండవు. వాటి గురించి అడగకండి అన్నారు. మరో కామెంట్ గా... సెట్స్ లో కొందరు దర్శకులు అప్పటికప్పుడు డైలాగ్స్ రాసి ఇస్తూ ఉంటారు. ఇడ్లీ వేడివేడిగా ఇవ్వాలి. డైలాగ్స్ కాదు. ఈ విషయంలో టాలీవుడ్ దర్శకులు మారాలి, అన్నారు. ఈ రెండు డైలాగ్స్ కొరటాలను ఉద్దేశించే చిరు చేశారనేది కొరటాల అభిమానుల ఆరోపణ. 

ఆచార్య మూవీతో కొరటాల ఆర్ధికంగా నష్టపోయారు. పైగా చిరంజీవి ఇలాంటి కామెంట్స్ తో ఆచార్య ఫెయిల్యూర్ పూర్తిగా కొరటాల మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుండి సోషల్ మీడియాలో చిరంజీవి కామెంట్స్ చర్చకు దారితీయగా, కొరటాల అభిమానులు ఆయనకు కౌంటర్లు ఇస్తున్నారు. అనవసరంగా చిరంజీవి సమసిపోయిన వివాదాన్ని తన కామెంట్స్ తో తట్టిలేపినట్లు అయ్యింది. నెక్స్ట్ కొరటాల ఎన్టీఆర్ తో మూవీ చేస్తుండగా బ్లాక్ బస్టర్ కొట్టి తానేమిటో మెగాస్టార్ కి తెలియజేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 
 

click me!