ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ 15ఏళ్ల కెరీర్‌.. స్పెషల్‌ సీడీపీ వైరల్‌

Published : Jan 10, 2021, 06:09 PM IST
ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ 15ఏళ్ల కెరీర్‌.. స్పెషల్‌ సీడీపీ వైరల్‌

సారాంశం

రామ్‌ పదిహేనేళ్ల కెరీర్‌ పూర్తి చేసుకున్నారు. తొలి సినిమాతోనే హిట్‌ కొట్టాడు. వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొంది ఆకట్టుకోవడంతోపాటు రామ్‌కి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. నయా `దేవదాస్‌` నుంచి ఇప్పుడు `రెడ్‌` చిత్రం వరకు రామ్‌ కెరీర్‌ ఆటుపోట్లతో సాగిందని చెప్పొచ్చు.  

రామ్‌ పోతినేని.. ఈ పేరు వింటేనే ఎనర్జిటిక్‌ స్టార్‌ అనే ట్యాగ్ లైన్‌ గుర్తొస్తుంది. అవును రామ్‌ అంతే ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఎప్పుడూ రెబ్‌బుల్‌ తాగిన మాదిరిగా ఎనర్జిటిక్‌గా ఉంటారు. సినిమాల్లోనూ ఆయనది అదే దూకుడు. సినీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్‌ `దేవదాస్‌`తో హీరోగా కెరీర్‌ని ప్రారంభించారు. ఇది విడుదలై రేపటి(సోమవారం)తో 15ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. 

తొలి సినిమాతోనే హిట్‌ కొట్టాడు. వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొంది ఆకట్టుకోవడంతోపాటు రామ్‌కి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. నయా `దేవదాస్‌` నుంచి ఇప్పుడు `రెడ్‌` చిత్రం వరకు రామ్‌ కెరీర్‌ ఆటుపోట్లతో సాగిందని చెప్పొచ్చు. పదిహేనేళ్ల కెరీర్‌లో ఆయన 19 సినిమాలు చేయగా, ఐదు సినిమాలు మాత్రమే విజయాన్ని సాధించాయి. కానీ ఏమాత్రం క్రేజ్‌, ఇమేజ్‌ తగ్గలేదు. సినిమా సినిమాకి తన రేంజ్‌ని పెంచుకుంటూ వస్తున్నాడు. 

వరుస పరాజయాల తర్వాత `నేను శైలజ` ఓ సారి నిలబెట్టగా, పూరీ దర్శకత్వంలో వచ్చిన `ఇస్మార్ట్ శంకర్‌` సాలిడ్‌ హిట్‌నిచ్చి వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసింది. ప్రస్తుతం ఆయన `రెడ్‌` చిత్రంలో నటించారు. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కానుంది. ఇదిలా ఉంటే రామ్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సందర్భంగా `ర్యాపో 15ఇయర్స్ ఇన్ టీఎఫ్‌ఐ` పేరుతో ఓ స్పెషల్‌ సీడీపీని విడుదల చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Venkatesh Top 10 Movies: తప్పక చూడాల్సిన వెంకటేష్‌ టాప్‌ 10 మూవీస్‌.. ఇలాంటి రికార్డు ఉన్న ఒకే ఒక్క హీరో
Illu Illalu Pillalu Today 13 డిసెంబర్ ఎపిసోడ్ : రామరాజు ముందు నోరు విప్పిన చందు, అమూల్య బలి, భర్తను బకరా చేసిన వల్లి