
రాజమౌళి కుటుంబంతో పాటు సరదా టూర్ ప్లాన్ చేశారు. రాజమౌళి ప్రస్తుతం తమిళనాడులో గల తూతుక్కుడిలో ఉన్నారు. అక్కడ రీస్టార్ట్స్ మొక్కలు నాటారు. రాజమౌళితో పాటు భార్య రమా రాజమౌళి, కొడుకు కార్తికేయతో పాటు కూతురు ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. రాజమౌళి అరుదుగా వెకేషన్స్ కి వెళుతుంటారు. ఆయన వరల్డ్ టూర్ కంటే కూడా సౌత్ ఇండియాలో గల హిల్ స్టేషన్స్ కి వెళ్లేందుకు ఇష్టపడతారు.
మరోవైపు మహేష్ బాబు 29వ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించనున్నారు. స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే సూచనలు కలవు. ఇది జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ అని కథ అందిస్తున్న విజయేంద్రప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడుగా మహేష్ కనిపిస్తారు. ఇండియానా జోన్స్ మాదిరి సాహసాలతో సాగుతుందన్నారు.
హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటులు పని చేయనున్నారు. రాజమౌళి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో మహేష్ మూవీ తెరకెక్కనుంది. దాదాపు రూ. 800 కోట్లు అని ప్రచారం జరుగుతుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆస్కార్ సాధించిన రాజమౌళి ఇమేజ్ గ్లోబల్ స్థాయికి వెళ్ళింది. ఈ క్రమంలో హాలీవుడ్ చిత్రాలకు ఈ ఏమాత్రం తీసిపోకుండా మహేష్ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించనున్నారు.