దేవరను పరిచయం చేయబోతున్న కొరటాల, ఎన్టీఆర్ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్..?

Published : Dec 21, 2023, 01:20 PM IST
దేవరను పరిచయం చేయబోతున్న కొరటాల, ఎన్టీఆర్ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్..?

సారాంశం

గెట్ రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీకోసం సాలిడ్ అప్ డేట్ రెడీ అవుతుంది. త్వరలో మీ కళ్లు జిగేలుమనేలా.. హృదయం ఉప్పోంగి పోయేలా భారీ అప్ డేట్ ను రెడీ చేస్తున్నాడు కొరటాల శివ.   

ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి ఒక్కసినిమా కూడా రాలేదు. ఈ ఏడాది వెండితెరపై తారక్ ను మిస్ అయ్యారు ఫ్యాన్స్. దాంతో మంచి ఆకలి మీద ఉన్న అభిమానుల కోసం అద్భుతమైన విందు రెడీ చేస్తున్నారు కొరటాల టీమ్. గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ సినిమా దేవర. ఈమూవీ కోసం ఫ్యాన్స్ వెయ్యికళ్ళతో ఎదరు చూస్తున్నారు. నెక్ట్స్ ఇయర్ రిలీజ్ కోసం రెడీ అవుతుంది మూవీ.  

ఈమూవీ నుంచి సాలిడ్ అప్ డేట్ అయినా ఇస్తారని చూస్తున్నారు. అయితే అభిమానులు సంతృప్తి పడేలా అదిరిపోయే విషయం కొరటాల వదలబోతున్నాడట. సూపర్ ఫాప్ట్ గా కంప్లీట్ అవుతున్నఈసినిమాలో ఎన్టీఆర్ ను పక్కా మాస్ యాక్షన్ హీరోగా చూడబోతున్నాం.  దేవర టైటిల్ కు తగ్గట్టు ఎన్టీఆర్ ఎలా ఉంటాడు అనేది అందరికి ఆసక్తి కరంగా మారింది. ఇక ఈ ఏడాదికి స్వస్థి చెప్పి.. 2024 లు రాబోతుంది త్వరలో. దాంతో న్యూ ఇయర్ గిఫ్ట్ గా కొరటాల దేవర నుంచి భారీ అప్ డేట్ ను ప్లాన్ చేసినట్టు సమాచారం. 

అసలు ఈ దేవర అనే పాత్ర ఎలా ఏలా ఏంటుంది. ఆ పాత్రఇంట్రడక్షన్ ఏంటీ అని అందరిలో క్యూరియాసిటీ ఉంది. త్వరలో ఈ పాత్రను పరిచయం చేయనున్నట్టు తెలుస్తోందిలేటెస్ట్ బజ్ ప్రకారం అయితే దర్శకుడు కొరటాల శివ సినిమా థీమ్ పై ఓ ఇంట్రెస్టింగ్ ట్రీట్ ని ఆడియెన్స్ కి పరిచయం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దానిని టీజర్ కన్నా ముందు రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్టుగా టాక్. దీనితో అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏ లెవెల్లో ఉండబోతుంది అనేది అందరికీ క్లారిటీ రావచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌