తండ్రేమో సూపర్ స్టార్.. కొడుకుకు మాత్రం 15ఏళ్లలో ఒకేఒక్క హిట్.! ఆ హీరో గురించి

Published : Dec 21, 2023, 12:36 PM IST
తండ్రేమో సూపర్ స్టార్.. కొడుకుకు  మాత్రం 15ఏళ్లలో ఒకేఒక్క హిట్.! ఆ హీరో గురించి

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో కొడుకుగా వెండితెరకు పరిచయయ్యాడు. 15 ఏళ్ల తన కెరీర్ లో  ఒక్కటే హిట్ పడింది. దశాబ్దానికి పైగా ఇంకా బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరో గురించి తెలుసుకుందాం.  

బాలీవుడ్ సీనియర్ నటుడు, ఒకప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)  పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. 80, 90లలో తన సినిమాలతో హిందీ ఆడియెన్స్ ను అలరించారు. అయితే, బాలీవుడ్ లో తండ్రి బాటలోనే సినీ రంగంలో అడుగుపెట్టిన హీరోలు చాలా మందే ఉన్నారు. తండ్రికి తగ్గ తనయులు అనిపించిన వారు కొందరు ఉంటే... కొందరు మాత్రం ఎంత కష్టపడుతున్నా సక్సెస్ వారి దరి చేరడం లేదు. అయినా ఎంతో ఓపికగా... డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ఇంకా ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

తండ్రి స్టార్ హీరో అయినా... కొడుకు మాత్రం పెద్దగా కెరీర్ లో సక్సెస్ సాధించలేకపోయారు. ఆయనే మహాక్షయ్ చక్రవర్తి (Mahaakshay Chakraborty). బాలీవుడ్ ఆడియెన్స్ మిమో చక్రవర్తి (Mimoh Chakraborty) అని పిలుస్తుంటారు. మిమో చక్రవర్తి తండ్రి, తల్లి యోగితా బలి కూడా నటీనటులుగా మంచి గుర్తింపు సంపాదించారు. తమ సినిమాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. తల్లిదండ్రులు తమ కెరీర్ లో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక వారి బాటలోనే మిమో చక్రవర్తి కూడా నటనరంగంలో అడుగుపెట్టారు. 

2008లో మిమో చక్రవర్తి ‘జిమ్మి’ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు. తొలి సినిమాలో ‘మిమో’ అనే పాత్రలో నటించారు. అందుకే ఆయనను మిమో చక్రవర్తి అని కూడా పిలుస్తుంటారు. కానీ, ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి విమర్శలు, ఆడియెన్స్ నుంచి ఈ చిత్రం విమర్శలు అందుకుంది. మొదటి సినిమానే సూపర్ ఫ్లాప్ గా నిలిచింది.  అమితాబ్ బచ్చన్ నటించిన 'మజ్బూర్' చిత్రం 1974లో విడుదలైంది. అదే చిత్రాన్ని ‘జిమ్మి’గా రీమేక్ చేశారు. తొలిసినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆ తర్వాత 2011లో వచ్చిన ‘హంటెడ్’ చిత్రంతో హిట్ అందుకున్నారు.

అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే వస్తున్నారు. లీడ్ రోల్ లోనే కాకుండా కీలక పాత్రల్లోనూ నటిస్తున్నారు. 12 ఏళ్లుగా మిమో చక్రవర్తి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. తండ్రి స్టార్ హీరోగా మెప్పించడం, తల్లి కూడా నటిగా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో... మహాక్షయ్ చక్రవర్తి కెరీర్ ఎప్పుడూ టర్న్ అవుతుందోనని చూస్తున్నారు. ఇప్పటికీ యాక్టివ్ గానే ఉన్నారు. కాస్తా ఆలస్యమైనా కెరీర్ లో మంచి సక్సెస్ చూడాలని ఆడియెన్స్ ఆశిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు
Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?