షార్ట్ గా దుబాయ్‌ చుట్టేసిన ఎన్టీఆర్‌.. ఎయిర్‌పోర్ట్ లో దొరికిపోయాడు..

Published : Nov 19, 2020, 10:06 AM IST
షార్ట్ గా దుబాయ్‌ చుట్టేసిన ఎన్టీఆర్‌.. ఎయిర్‌పోర్ట్ లో దొరికిపోయాడు..

సారాంశం

ఈ ఏడాది కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి కుదుట పడుతుండటంతో వరుసగా ఫారెన్‌కి చెక్కేస్తున్నారు మన స్టార్స్. ఇప్పుడు ఎన్టీఆర్‌ సైతం షార్ట్ ట్రిప్‌ వేశారు. ఎయిర్‌పోర్ట్ లో దొరికిపోయారు.

లాక్‌డౌన్‌ ఎత్తేశారు. కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుంది. సినిమా షూటింగ్‌లు ఊపందుకుంటున్నాయి. ఇక సెలబ్రిటీలు సైతం ఫారెన్‌ ట్రిప్పులు స్టార్ట్ చేశారు. జనరల్‌గా ప్రతి ఏడాది రెండుమూడు సార్లు ఫారెన్‌ ట్రిప్పులు వేస్తుంటారు మన హీరోహీరోయిన్లు. ఈ ఏడాది కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి కుదుట పడుతుండటంతో వరుసగా ఫారెన్‌కి చెక్కేస్తున్నారు మన స్టార్స్. దీపావళికి కుటుంబంతో కలిసి అమెరికా వెళ్ళిన మహేష్‌ మూడు రోజుల క్రితమే హైదరాబాద్‌ చేరుకున్నారు.  

ఇప్పుడు ఎన్టీఆర్‌ సైతం షార్ట్ ట్రిప్‌ వేశారు. ఆయన ఎవరికీ తెలియకుండా దుబాయ్‌కి వెళ్లి వచ్చారు. బుధవారం ఆయన దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తూ ఎయిర్‌పోర్ట్ లో ఫోటోలకు చిక్కారు. తన కుమారుడు అభయ్‌, భార్య ప్రణతిలతో కలిసి ఆయన దుబాయ్‌ వెళ్ళారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ మాస్క్ ధరించి, మెరూన్‌ కలర్‌ టీషర్ట్, జీన్స్  పాయింట్‌తో స్టయిలీష్‌గా కనిపిస్తున్నారు. 

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా, వణికే చలిని కూడా లెక్కచేయకుండా నిర్విరామంగా షూటింగ్‌ జరుపుతున్నారు. ఇందులో ఎన్టీఆర్‌.. కొమురంభీమ్‌గా, రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలియాభట్‌, ఒలివీయా మోర్రిస్‌ హీరోయిన్లుగా, అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

పెద్ది నుంచి ప్యారడైజ్ వరకు.. 2026 లో రాబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలేంటో తెలుసా?
హీరోయిన్ లేని సినిమా నాకు వద్దు, అట్టర్ ఫ్లాప్ అవుతుందనుకున్న సినిమాతో చరిత్ర సృష్టించిన కృష్ణ