`ఆదిపురుష్‌` నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రభాస్‌..ఫ్యాన్స్ ఊగిపోవాల్సిందే!

Published : Nov 19, 2020, 07:35 AM IST
`ఆదిపురుష్‌` నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రభాస్‌..ఫ్యాన్స్  ఊగిపోవాల్సిందే!

సారాంశం

`ఆదిపురుష్‌` నుంచి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ని పంచుకున్నాడు ప్రభాస్‌. సినిమా విడుదల తేదీని వెల్లడించారు. సినిమా ప్రారంభమే కాలేదు, అప్పుడే విడుదల తేదీని నిర్ణయించారు. దీంతో అభిమానులు ఊగిపోతున్నారు.

ప్రభాస్‌ ప్రతిష్టాత్మకంగా నటించబోతున్న చిత్రాల్లో `ఆదిపురుష్‌` ఒకటి. డైరెక్ట్ హిందీ చిత్రమిది. పాన్‌ ఇండియా సినిమాతో పౌరాణికం నేపథ్యంలో రూపొందబోతుంది. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దీన్ని త్రీడీలో తెరకెక్కించనున్నారు. టీ సిరీస్‌పై భూషణ్‌ కుమార్‌, కిషణ్‌ కుమార్‌ దీన్ని నిర్మించనుంది. 

ఇందులో విలన్‌గా సైఫ్‌ అలీ ఖాన్‌ నటించనున్నారు. ఇక సినిమాలో ప్రభాస్‌ రాముడిగా, సైఫ్‌ రావణుడిగా కనిపించనుండగా, సీత ఎవరు అనేది సస్పెన్స్ నెలకొంది. అనుష్క శర్మ, దీపికా పదుకొనె, అనుష్క వంటి పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎవరు ఫైనల్‌ అవుతారన్నది సస్పెన్స్ నెలకొంది. 

ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ని పంచుకున్నాడు ప్రభాస్‌. సినిమా విడుదల తేదీని వెల్లడించారు. సినిమా ప్రారంభమే కాలేదు, అప్పుడే విడుదల తేదీని నిర్ణయించారు. 2022లో ఆగస్ట్ 11న విడుదల చేయనున్నట్టు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక సినిమా వచ్చే ఏడాది జనవరిలో పట్టాలెక్కనుంది. దీంతో ప్రభాస్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్