నటి గౌతమి ఇంట్లో తాగుబోతు హంగామా.. అరెస్ట్..ఇంతకి ఎవరతను?

Published : Nov 19, 2020, 08:03 AM IST
నటి గౌతమి ఇంట్లో తాగుబోతు హంగామా.. అరెస్ట్..ఇంతకి ఎవరతను?

సారాంశం

తాగిన మత్తులో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో గౌతమి ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు పట్టుకుని పోలీసులకు అప్పగించగా, అతన్ని అరెస్ట్ చేశారు. మరింతకు ఎవరు ఆ అపరుచిత వ్యక్తి, గౌతమి ఇంట్లోకి ఎందుకు వచ్చాడనేది పోలీసులు ఆరా తీయగా, ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.   

సీనియర్‌ నటి గౌతమి ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడి హంగామా చేశాడు. బాగా తాగి ఉన్న ఆ వ్యక్తి కాసేపు భయాందోళనకు గురి చేశారు. తాగిన మత్తులో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో గౌతమి ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు పట్టుకుని పోలీసులకు అప్పగించగా, అతన్ని అరెస్ట్ చేశారు. మరింతకు ఎవరు ఆ అపరుచిత వ్యక్తి, గౌతమి ఇంట్లోకి ఎందుకు వచ్చాడనేది పోలీసులు ఆరా తీయగా, ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 

ఆ వ్యక్తి పేరు పాండియన్‌. గౌతమి ఇంట్లోకి ప్రవేశించి అనుమానాస్పదంగా తిరగడంతో అందులో పనిచేసే సతీష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆ సమయంలో అతను బాగా మద్యం సేవించి ఉన్నాడు. అయితే గోడ పక్కన దాక్కుని ఆందోళన కలిగించాడు. దీంతో పోలీసులు పాండియన్‌ని అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా గౌతమి ఇంట్లోకి ప్రవేశించడంతో అతనిపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాండియన్‌ అనే వ్యక్తి సోదరుడు గౌతమి ఉండే ఇంటికి సమీపంలో ఉంటాడని, అతన్ని కలిసేందుకు వచ్చాడని, మద్యం మత్తులో ఆ ఇంటికి వెళ్లబోయి గౌతమి ఇంట్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అరెస్ట్ చేసిన అనంతరం పాండియన్‌ బెయిల్‌ పై విడుదలయ్యాడు. 

సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన గౌతమి కొన్నాళ్ళపాటు విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌తో సహజీవనం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విడిపోయారు. ఇప్పుడు సపరేట్‌గా ఉంటున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్